Date:22/01/2021
హైదరాబాద్ ముచ్చట్లు:
;పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను బిఆర్ కెఆర్ భవన్ లో కలిసారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తగు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నివేదించిన అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకవెళ్లానని చెప్పారు.రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మేరకు చేపడుతున్న అభివృద్ధి లో పోలీస్ సిబ్బంది కీలకమైన బాధ్యతను పోషిస్తున్నారన్నారు. అసోసియేషన్ సభ్యులు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు.ఈ సమావేశంలో డిజిపి మహేందర్ రెడ్డి, అడిషనల్ డిజి జితేందర్ లు పాల్గొన్నారు.
పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి
Tags: Appropriate measures for the welfare of police personnel: CS Somesh Kumar