Natyam ad

పార్టీలో సముచిత స్థానం కల్పించాలి

మంత్రి బొత్స కు మా సమస్యలు వివరించాం

సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు
* పార్టీ జిల్లా ఇన్చార్జి కు వినతి

విజయనగరం ముచ్చట్లు:

Post Midle

విజయనగరం నియోజకవర్గంలో మాకు సముచిత స్థానం కల్పించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిల్లా విజయకుమార్, వైయస్సార్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు ఆవనాపు విజయ్ డిమాండ్ చేశారు.  స్థానిక ఎమ్మెల్యే మాపై కక్షగట్టి వ్యవహరిస్తున్న తీరును, ఆయన పార్టీకి చేస్తున్న నష్టాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జ్ బొత్స సత్యనారాయణ ను విజయవాడలో కలిసి వినతి పత్రం అందజేయడంతో మంత్రి బొత్స సానుకూలంగా స్పందించారని విజయ్ కుమార్ చెప్పారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జ్ మజ్జి శ్రీనివాసరావును గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలో కలిసి తమ సమస్యలను  వివరించినట్లు వెల్లడించారు. అనంతరం పిల్లా,అవనాపు విలేకరులతో మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు,

 

 

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆయన వెంట నడిచి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని స్పష్టం చేశారు. పార్టీలో తమకంటే వెనుక వచ్చిన వారికి అందలమెక్కించి మాపై చిన్నచూపు చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం నియోజకవర్గంలో వైయస్సార్ పార్టీ గెలుపులో తామంతా ఎంతో కృషి చేశామని, అయినప్పటికీ మమ్మల్ని మంత్రి బొత్స వర్గమని చెప్పి స్థానిక ఎమ్మెల్యే పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంచడంతోపాటు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసిన మమ్మల్ని కార్పొరేషన్ ఎన్నికల్లో పక్కనపెట్టి స్థానిక ఎమ్మెల్యే తన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు, తన  వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నవారికి, తన చెప్పు చేతుల్లో ఉండే ఉండేవారికి కార్పొరేషన్ సీట్లను ఇచ్చారని,

 

 

 

అయినప్పటికీ పార్టీ అధిష్టానం ఆదేశాలను శిరసావహించి కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు కోసం తామంతా కృషి చేయడం వల్ల 48 స్థానాలను గెలుచుకోగలిగామని స్పష్టం చేశారు. పార్టీ విజయాలకు తాము ఎంతో కృషి చేస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే వ్యవహార శైలి మాకు ఎంతో బాధ కలిగిస్తుందని అన్నారు. ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలో కార్పొరేటర్లు, సర్పంచులను బినామీలుగా చేసి వారిని ఒక దిష్టిబొమ్మల చూపించి, ఒక నియంత లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో  ఏ ఫైల్ కదలాలన్నా ముందుగా అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లాలని ఆదేశించడంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో ఎమ్మెల్యే ఆదేశాలను శిరసా వహిస్తూ మానసిక ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు.

 

 

 

ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడ కారణంగా నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన  ఎమ్మెల్యే నియోజకవర్గంలో భూదందాలు, అవినీతి, కబ్జాలు చేస్తూ పార్టీకి తీరని నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. పార్టీ జెండాతో గెలిచిన వారందరినీ పక్కనపెట్టి ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తున్నారని, వారు ఆడిందే ఆట పాడిందే పాటగా ఎమ్మెల్యే తీరు ఉందని విమర్శించారు. నియోజకవర్గంలో పార్టీకి జరుగుతున్న నష్టంపై పార్టీ ఇన్చార్జిలు దృష్టి పెట్టకపోతే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు గాడు అప్పారావు, కోరాడ సూర్య ప్రభావతి, చందకు రమణ, దుక్క లక్ష్మి, పొట్నూర్ పద్మ, పార్టీ నాయకులు రౌతు చంటి, పొట్నూరు వెంకటరాజు, కంది అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Appropriate position should be provided in the party

Post Midle