పోల‌వ‌రం అంచ‌నాల‌కు ఆమోదం

Date:24/09/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జలవరంగా మారిన పోలవరం ప్రాజెక్టు అంచనాలను పెంచుతూ కేంద్ర జలశక్తి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం రూ.4,124.64 కోట్లు, నీటిపారుదల విభాగం వ్యయం రూ.43,164.83 కోట్లని నిర్ధారిస్తూ కేంద్ర జల్‌ శక్తి శాఖకు మార్చి 6న ఆర్‌ఈసీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ యథాతథంగా తాజాగా ఆమోదించారు.

 

ఇందుకు సంబంధించిన ఫైలుపై సంతకం చేసి కేంద్ర ఆర్థికశాఖకు పంపారు. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ), కేంద్ర ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ(ఆర్‌ఈసీ) ఇప్పటికే అంచనా వ్యయాన్ని సవరించేందుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ ఫైలుపై  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సంతకం చేయడం ఇక లాంఛనమే!ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించాక నిపుణుల కమిటీతో పోలవరం పనులను ప్రక్షాళన చేయించడం. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో దర్యాప్తు చేయించడం. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఖజానాకు రూ.838 కోట్లను మిగిల్చడం వంటి మార్పులను ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు ప్రభుత్పాధినేత వైఎస్ జగన్ వివరించారు. సవరించిన అంచనా వ్యయం మేరకు నిధులు విడుదల చేసి ప్రాజెక్టును 2021 నాటికి పూర్తిచేసేలా సహకరించాలని కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేసేలా ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని కేంద్ర జలసంఘం సభ్యులు హెచ్‌కే హల్దార్‌ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీ, పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌లు కేంద్రానికి నివేదిక ఇచ్చారు.

 

 

ఆర్‌ఈసీ కూడా అదే రీతిలో నివేదిక ఇవ్వడంతో కేంద్రం వైఖరిలో మార్పు వచ్చింది.2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,656.87 కోట్లుగా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదించి ఆర్‌ఈసీకి నివేదిక పంపింది. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని పూర్తి చేసేందుకు ఎన్ని నిధులు అవసరమైతే అన్ని నిధులను కేంద్రం విడుదల చేయాల్సిందేనని ఆర్‌ఈసీకి ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌లతో సీఎం జగన్‌ చర్చించారు.ఈ క్రమంలోనే 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా ఈనెల 6న ఆర్‌ఈసీ నిర్ధారించి ఆమోదించింది. నీటిపారుదల వ్యయం రూ.43,164.83 కోట్లు, 2014 ఏప్రిల్‌ 1 వరకు పనులకు చేసిన వ్యయం రూ.5,135.87 కోట్లు, ఇప్పటిదాకా కేంద్రం రీయింబర్స్‌ చేసిన నిధులు రూ.8,507.26 కోట్లను మినహాయిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా రూ.29,521.70 కోట్లను కేంద్రం విడుదల చేయాల్సి ఉంటుంది.  ప్రభుత్వ చిత్తశుద్ధి, ఆర్‌ఈసీ నివేదికలతో కేంద్రం వైఖరి మారినందునే ఈ ప్రాజెక్టు అంచనాల పెంపుకు కేంద్రం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులూ తొలగిపోవడంతో ఇక దాన్ని అనుకున్న గడువులో పూర్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.

క‌మ‌లానికి వ‌రుస స‌వాళ్లు

Tags:Approval for Polavaram estimates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *