Natyam ad

మూడు రాజధానుల ఏర్పాటుకు ఆమోదం- ఎంపీ రెడ్డెప్పతో సహా మేదావుల వెల్లడి

పుంగనూరు ముచ్చట్లు:

మూడు రాజదానుల ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ రౌండ్‌టే బుల్‌ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మాణించినట్లు చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప తెలిపారు. బుధవారం సాయంత్రం శ్రీబాగ్‌ ఒప్పందంపై మేదావులతో సమావేశాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంపీ, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి హాజరైయ్యారు. ఎంపీ మాట్లాడుతూ శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం మూడు రాజధానులు ఎంతో అవసరమన్నారు. మద్రాసు, కర్నూలు, హైదరాబాద్‌, అమరావతితో రాయలసీమకు గుర్తింపుకు నోచుకోలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదనతో రాయలసీమకు గుర్తింపు లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రికి ఎలాంటి స్వార్థము లేదన్నారు. స్వార్థం ఉండిఉంటే వైఎస్సార్‌ జిల్లాలో రాజధాని ఏర్పాటు చేసుకునే వారని స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అధికారాన్ని గ్రామస్థాయికి వికేంద్రీకరించిన ఘనత ముఖ్యమంత్రిదేనని కొనియాడారు. కుయుక్తులతో చంద్రబాబునాయుడు అమరావతిని ఎరగాచూపుతున్నారని ఆరోపించారు. అమరావతి పేరు మాత్రమే బాగుందని ఎద్దెవా చేశారు. మేదావులు ఏర్పాటు చేసిన శ్రీబాగ్‌ ఒప్పందాన్ని అమలు చేసేందుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, లలిత, కౌన్సిలర్లు అమ్ము, నరసింహులు, మనోహర్‌, పిఎల్‌.ప్రసాద్‌, కాళిదాసు, భారతి, సాజిదా, వైఎస్సార్‌సీపీ నాయకులు అమరేంద్ర, అమరనాథరెడ్డి, చెంగారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రమణ, సలామత్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

సీఎం జగన్‌ నిర్ణయం ఆమోదయోగ్యం

పుంగనూరు:

రాష్ట్రా  న్ని మూడు ప్రాంతాలుగా విభజించి అధికార వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదన సర్వత్ర ఆమోదయోగ్యం. దీనిని రాష్ట్ర ప్రజలందరు ముక్తకంఠంతో ఆమోదిస్తారు. తెలుగుదేశం పార్టీకి, ఎల్లో మీడియాకు మాత్రం అమరావతి కనిపిస్తోంది. అమరావతి పేరు బాగుంది. అక్కడ ఏమి లేదు. 30 కిలో మీటర్లు ప్రయాణిస్తే కానీ హైకోర్టు, అసెంబ్లి మనకు కనపడదు. రాకపోకలు సాగించాలంటే ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడుతుంది. అలాంటి ప్రాంతంలో రాజధాని ఉండాలనడం ఏమాత్రం మంచిది కాదు. అవసరమైతే మూడు రాజధానులకు ఉధ్యమిస్తాం.


– ఎన్‌.రెడ్డెప్ప, ఎంపీ, చిత్తూరు.

హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలి …

మూడు రాజధానులు ఏర్పాటు ఆమోదయోగ్యమని పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ స్పష్టం చేశారు. అలాగే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి తిరుపతి, అమరావతిలో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీబాగ్‌ ఒడంబడిక నుండి రాయలసీమకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రస్తుతం హైకోర్టు ఏర్పాటుతో గుర్తింపు లభిస్తుందని మద్దతు ఇస్తామని తెలిపారు.

– వెంకటరెడ్డి యాదవ్‌, పీకెఎం ఉడా చైర్మన్‌, పుంగనూరు.

మూడు రాజధానుల కోసం ఉధ్యమం ….

మూడు రాజధానుల ఏర్పాటు కోసం అవసరమైతే ఉధ్యమం ప్రారంభిస్తామని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి సమావేశంలో తెలిపారు. రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి ల నియోజకవర్గం నుంచి మూడు రాజధానుల ఏర్పాటుకు ఐకమత్యంతో ఉధ్యమం చేపడుతామన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం జరుగుతోందన్నారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది , శ్రీబాగ్‌ ఒప్పందానికి గుర్తింపు లభిస్తుందన్నారు.

– అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ, పుంగనూరు.

సీఎం జగన్‌ నిర్ణయం ఆమోదయోగ్యం…

మూడు రాజధానుల ఏర్పాటు ఆమోదయోగ్యమేనని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతు ఇస్తాం. ఈ విషయంలో రాయలసీమ ప్రజల ఐకమత్యాన్ని చాటుతాం.

– సరస్వతి, విశ్రాంత హెచ్‌ఎం, పుంగనూరు.

శ్రీబాగ్‌ అమలు చేయాలి…

శ్రీబాగ్‌ ఒప్పందాన్ని అమలు చేసి, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణతో రాయలసీమకు గుర్తింపు లభిస్తుంది. ఎవరు కుట్రపన్నినా తగిన గుణపాఠం నేర్పుతాం. రాయలసీమలో హైకోర్టు సాధనకు కృషి చేస్తాం.

– నాగేనాయక్‌, ఎన్‌జీవోల సంఘ నాయకుడు, పుంగనూరు.

వికేంద్రీకరణతో గుర్తింపు….

పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుతో అన్ని ప్రాంతాలకు గుర్తింపు లభిస్తుంది. గతంలో కొన్ని ప్రాంతాలకే గుర్తింపు లభించేది. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది. వికేంద్రీకరణకు మద్దతు ఇస్తున్నాం.

– ఎన్‌.చంద్రారెడ్డి యాదవ్‌, వైఎస్సార్‌సీపీ నాయకుడు, పుంగనూరు.

 

 

Tags: Approval for the formation of three capitals – revelations of intellectuals including MP Reddappa

Post Midle

Leave A Reply

Your email address will not be published.