పుంగనూరు మున్సిపాలిటిలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటి అత్యవసర సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపినట్లు మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా తెలిపారు. మంగళవారం కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. అజెండాను ప్రారంభించిన వెంటనే కౌన్సిలర్ అమ్ము మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మునుపెన్నడు జరగలేదన్నారు. అలాగే ఎంపీ మిధున్‌రెడ్డి నిధులతో కమ్యూనిటి భవనాలు, ఆర్వోఆర్ ప్లాంట్లు, మెకానిక్‌లకు ర్యాంపులు అందించడం జరిగిందని తెలిపారు. అలాగే కాలువల నిర్మాణంలో రోడ్డుకన్నా ఎత్తులో కాలువ ఏర్పాటు చేయడంతో నీరు నిల్వ ఉంటోందని దీనిని సరిదిద్దాలని సూచించారు. మున్సిపాలిటి అజెండాను ఆమోదిస్తున్నట్లు ప్రతిపాదించడంతో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్లు నాగేంద్ర, సిఆర్.లలిత, డీఈఈ మహేష్, ఏఈ కృష్ణకుమార్, ఎన్వీరాన్మెంట్ల్ ఇంజనీర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Tags: Approval of development programs in Punganur Municipality
