Approximately 700 people

700 మందికి అన్నదానం

Date:07/05/2020

చౌడేపల్లి ముచ్చట్లు:

కరోనా విపత్కర సమయంలో పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని మంత్రి పెద్ద డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు బోయకొండ ఈవో చంద్రమౌళి ఆధ్వర్యంలో 700 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు ఎంపీ రెడ్డప్ప వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి హాజరయ్యారు. ఎంపిడిఓ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ కరో విపత్కర సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా దాతల సహకారంతో చౌడేపల్లి మండలంలో సరుకుల పంపిణీ, భోజన ప్యాకెట్ల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టడం ఆదర్శనీయమని కొనియాడారు. ప్రజలు లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. భౌతిక దూరమును పాటించి లాక్ డౌన్ నియమాలను తప్పనిసరిగా అమలు చేస్తున్న అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు పోలీసు సిబ్బంది తదితర అధికారులు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు నేటి నుంచి ప్రతిరోజు బోయకొండ ఆలయం ఆధ్వర్యంలో భోజన సదుపాయం కల్పించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ పి పి మెంబెర్ అంజిబాబు, జెడ్ పి టి సి దామోదర్ రాజు, ఎంపీపీ అభ్యర్థి రామమూర్తి, సింగిల్విండో చైర్మన్ మునస్వామి రాజు, యువనేత విద్యుత్ మిద్దె ంటికిషోర్, మాజీ జెడ్పిటిసి సభ్యురాలు రుక్మిణమ్మ, మాజీ ఎంపిపి రెడ్డి ప్రకాష్, ఎంపీడీవో శంకరయ్య, తాసిల్దార్ మురళి ఈవో చంద్రమౌళి, ఎస్సై కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

మదనపల్లిలో తొలి కరోనా కేసు నమోదు

Tags: Approximately 700 people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *