Natyam ad

ఏపీపీఎస్సీ పరీక్షలు విజయవంతం చేయాలి

కడప ముచ్చట్లు:


ఈనెల 24న జరగనున్న ఏపీపీఎస్సీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్-3 (ఎండోమెంట్స్) ఉద్యోగ నియామక పరీక్షలను విజయ వంతం చేయాలని  ఇంచార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి రామ్మోహన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాలులో.. ఏపీపీఎస్సీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్-3 పరీక్షల నిర్వహణపై.. లైజన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్స్, చీఫ్ సూపరిండెంట్స్ , పోలీస్, ఆర్టీసీ, మెడికల్ డిపార్ట్మెంట్ల అధికారులతో డిఆర్వో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్వో రామ మోహన్ మాట్లాడు తూ ఈనెల 24 జరగనున్న ఏపీపీఎస్సీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్-3 పరీక్షలను  ముందస్తు ప్రణాళికతో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పకడ్బందీగా నిర్వహించా లన్నారు. ఈనెల 24వ తేదీ (ఆదివారం) ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ నిర్వహించే ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 10.45 గంటలలోపే పరీక్ష కేంద్రానికి హాజరుకావాలన్నారు.  అభ్యర్థులు వారి వారి హాల్ టికెట్ తో పాటు పాస్ పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఒకటి తమతో పాటు తీసుకెళ్లాలన్నారు
పరీక్షా కేంద్రాల జాబితాలో.. గతంలో పొరపాటున జెఎంజె జూనియర్ కాలేజ్, మరియాపురం, వైఎస్ఆర్ కడప జిల్లా అని.. పరీక్ష కేంద్రం చిరునామాను చూపించడం జరిగిందని… దాన్ని కడప – రాజంపేట రోడ్డు, రామాంజ నేయపురం వద్ద ఉన్న జెఎంజె జూనియర్ కాలేజ్ గా.. గమనించి పరీక్ష కేంద్రానికి నిర్దేశిత సమయానికి హాజరుకావాలని డిఆర్వో తెలిపారు
ఈ కార్యక్రమంలో ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ బాబురావు, సెక్షన్ ఆఫీసర్ ఎం విజయ్ కుమార్, కడప కలెక్టరేట్ పరిపాలనాధికారి విజయ్ కుమార్, తాసిల్దార్ శివరామిరెడ్డి, లైజన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్స్, చీఫ్ సూపరిండెంట్స్ , పోలీస్, ఆర్టీసీ, మెడికల్ డిపార్ట్మెంట్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: APPSC exams should be successful

Post Midle
Post Midle