ఏపీఆర్‌సెట్‌ షెడ్యూల్‌ విడుదల

Date:10/09/2019

విశాఖ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌లోని 14 యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ, ఎంఫిల్‌ ప్రవేశాల కోసం ఏపీఆర్‌సెట్‌ షెడ్యూలును ఆర్‌సెట్‌ కన్వీనర్ శ్రీనివాసరావు‌, ఏయూ వీసీ ప్రొఫెసర్‌ పివిజిడి ప్రసాద్‌ రెడ్డి విడుదల చేశారు. దీనిప్రకారం ఈ నెల 11న నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. ఈ నెల 16 నుంచి అక్టోబరు 10 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రెండు వేల రూపాయల పరిహారంతో అక్టోబరు 16 వరకుగడువుంది. అక్టోబరు 28 నుంచి హాల్‌ టిక్కెట్ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 68 సబ్జెక్టులలో నవంబర్‌ 8 నుంచి 12 వరకు జరిగే పరీక్షలను విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు,నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి, హైదరాబాద్‌లలో నిర్వహించనున్నారు.

మౌనంగా వేణుగోపాలరెడ్డి

Tags: APRset Schedule Release

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *