Natyam ad

పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఆప్స్ నాయకులు

తిరుపతి ముచ్చట్లు:

ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్స్తవ సందర్భంగా సోమ వారం ఉదయం తిరుపతి రుయా ఆసుపత్రి ఎదురుగ గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ అభివృది పోరాట సమితి (ఆప్స్) అడ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆప్స్ రాష్ట్ర అధ్య క్షులు ఎన్. రాజా రెడ్డి మాట్లాడుతూ భాష ప్రయుక్త రాష్ట్రం కోసం తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం 58రోజులు చెన్నై నగరంలో ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణా ర్పణ చేసారని అనంతరం కేంద్ర ప్రభుత్వం 1956 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.శంకరంబాడి సాహితీ పీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ డి మస్తానమ్మ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసితన ప్రాణాలను కోల్పోయిన అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్నిస్పరించుకుంటూ నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఈరోజు తిరుపతిలో ఘనంగా జరుపుకుంటున్నాము.మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ అహింసా సత్యము హరిజనోద్దరణ కు కూడా పాటుపడిన మహా పురుషుడు పొట్టి శ్రీరాములు అని కొని యాడారు.
వీరి బలిదాన ఫలితంగానే భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని అలాంటి గొప్ప వ్యక్తుల జీవిత త్యాగాలను నేటితరం విద్యార్థులు తెలుసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమం లో వై ఎస్ ఆర్ టీ యూ సి రాష్ట్ర నాయకులు మాండ్ల రాజేశ్, ఆప్స్ జిల్లా అధ్య క్షులు షేక్ మహ్మద్ రపీ, విశ్వం టాలెంట్ స్కూల్ ఆకడమిక్ డైరెక్టర్ ఎన్. విశ్వ చందన్ మరియు విశ్వం స్కూల్ విద్యార్తులు పాల్గొన్నారు.

Post Midle

Tags: APS leaders paid tributes to the statue of Potti Sriramulu by garlanding it

Post Midle

Leave A Reply

Your email address will not be published.