ఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల

Date:11/08/2020

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ప్రొఫెసర్లు, లెక్చరర్ల అర్హత కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీసెట్) నోటిఫికేషన్‌-2020ని ఆంధ్రయూనివర్సిటీ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆగస్టు 14న దరఖాస్తులు ప్రారంభమవుతాయని, సెప్టెంబర్ 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసోవచ్చని తెలిపింది. దరఖాస్తులు అధికారిక వెబ్‌సైట్ andhrauniversity.edu.in, apset.net.inలో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.

అర్హత: సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ ఏడాది పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నవారు రెండేండ్లలో సర్టిఫికెట్లను సమర్పించాలి.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 14

దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 19

అప్లికేషన్ ఫీజు: రూ.1200, బీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.700

రాతపరీక్ష: డిసెంబర్ 6

వెబ్‌సైట్‌: apset.net.in

రాయలసీమ ఎత్తిపోతల పథకం కేసులో తీర్పు

Tags: APSET notification release

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *