కుంభవృష్టి…పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

Date:14/10/2020

విజయవాడ ముచ్చట్లు:

రెండు రోజులుగా కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు వాగులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ నగరాల్లో లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. నగరాల్లోని అనేక అపార్టుమెంట్లలోకి నీరు చేరింది. వివిధ ప్రాంతాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ ఉధృతరూపం దాల్చింది. గుంటూరులో మొదలుపెట్టి… కృష్ణా జిల్లాలో కుమ్మేసి, ఉభయ గోదావరి జిల్లాలను కుదిపేసి, ఆపై ఉత్తరాంధ్రను తడిపేసిన వాన! తీవ్ర వాయుగుండం తుఫానుగా మారకముందే మంగళవారం ఉదయం కాకినాడ వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో సోమవారం రాత్రి నుంచే వాన దంచికొట్టడం మొదలైంది. మంగళవారం కూడా కురుస్తూనే ఉంది. దీని దెబ్బకు వాగులు పొంగిపొర్లాయి. పలుచోట్ల వంకలు రోడ్లెక్కడంతో రాకపోకలు ఆగిపోయాయి. పొట్ట దశకు వస్తున్న వరి చేలు కిందికి పడకేశాయి. విజయవాడలో కొన్ని రహదారులు కాల్వలను తలపించాయి. వరద నీరు జాతీయ రహదారిపైకి ఎక్కడంతో హైదరాబాద్‌-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

 

భారీ వర్షాలతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు సైతం వాగులను తలపిస్తున్నాయి. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో అనేక కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట తీరంలోని ఉప్పులేరు పొంగడంతో పడవలు కొట్టుకుపోయాయి. జిల్లాలోని గోస్తని, శారదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.  భారీ వర్షాలు, గాలులతో పలుచోట్ల పంటలు నీట మునిగాయి. కోత, పొట్టదశలో ఉన్న వరి నీట మునిగింది. భారీ గాలుల వల్ల కొబ్బరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అనేక చోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. రహదారులు, చెరువు గట్లకు గండ్లు పడ్డాయి. వందలాది పూరిళ్లు కూలిపోయాయి.  విశాఖపట్నం – నర్సాపూర్‌ మధ్య కాకినాడకు 30 కి.మీ దూరంలోని నేమం ప్రాంతంలో  తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం 6.30 – 7.30 గంటల మధ్య తీరం దాటింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటిన సందర్భంగా గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

 

 

గాలివేగం ఒక దశలో 75 కిలోమీటర్ల గరిష్ట స్థాయికి చేరిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. మంగళవారం రాత్రి  పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 18 కి.మీ వేగంతో ప్రయాణించి తెలంగాణ దిశగా పయనిస్తోంది. ఇది క్రమంగా వాయుగుండంగా తదుపరి అల్పపీడనంగా బలహీన పడిందని తెలిపింది.  కోస్తా తీరంలో సముద్రం అలలు 4.5 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే ప్రమాదం ఉండటంతో పర్యాటకులు, మత్స్యకారులు తీరం వైపు వెళ్లొద్దని హెచ్చరించారు.   బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తీరం దాటుతూనే జల విలయం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిపించింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాను ముంచింది. మంగళవారం ఉదయం 6.30-7.30 గంటల మధ్య కాకినాడ వద్ద తీరం దాటింది. ఆ సమయంలో తీరప్రాంతంలో గంటకు 55-75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సముద్ర తీరం వద్ద అలలు 4.5 మీటర్ల ఎత్తుకు ఎగశాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు అనేక చోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 368 మండలాల్లో 10 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వాన పడింది. కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కర్నూలు, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మిగితా చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడ్డాయి.

 

 

. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, కోనసీమ తదితర ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎక్కడిక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. వాగులు, వంకలు, కాల్వలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.వరద ప్రభావిత జిల్లాల కలెక్టరేట్లలో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మందులు, నిత్యావసర వస్తువులను అవసరమైన మేరకు నిల్వ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. ఎక్కడకు కావాలంటే అక్కడికి సహాయ కార్యక్రమాల కోసం తరలించడానికి వీలుగా విశాఖపట్నం జిల్లాలో మూడు జాతీయ విపత్తు సహాయక దళాలను (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సిద్ధంగా ఉంచారు. కాకినాడలో ఒక ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని సిద్ధంగా ఉంచారు.

ఏనుగు మీద యోగా చేస్తూ జారిపడ్డ బాబా రాం‌దేవ్.

 

Tags:Aquarius … overflowing ditches, bends

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *