ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం పట్టణంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో ఏఆర్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. 2020లో పోలీస్ ఏ.ఆర్ కానిస్టేబుల్ గా నియమితుడయ్యాడు.. తరువాత కొత్తగూడెం పోలీస్ స్పెషల్ పార్టీలోలో పని చేశాడు. పోలీస్ శాఖలో బదిలీలో ప్రక్రియలో భాగంగా ములుగు జిల్లా కు బదిలీ అయింది. ఈ నెల 8వ తారీఖు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఖమ్మం పట్టణంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. రూమ్ క్లీనింగ్ కోసం వచ్చిన సిబ్బంది డోర్ కొట్టడంతో ఎంతసేపటికి ఓపెన్ చేయకపోవడంతో పోలీసులకు సమాచారం లాడ్జి యాజమాన్యం అందించింది. పోలీసులు డోర్ ఓపెన్ చేసి ఏఆర్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ మృతదేహం ను గుర్తించారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని యజ్ఞనారాయణపురం అశోక్ కుమార్ సొంత గ్రామం. ఈరోజు సొంత గ్రామంలో అశోక్ కుమార్ నిశ్చితార్థ కార్యక్రమం ఉంది..పెళ్లి పీటలు ఎక్కాల్సిన అశోక్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: AR constable commits suicide