ఒడిశా నుంచి యదేఛ్చగా గంజాయి రవాణా

అదిలాబాద్  ముచ్చట్లు:
మన్యంలో అక్రమ గంజాయి రవాణా జోరుగా సాగుతున్నది. వర్షాకాలం కావడంతో స్మగ్లర్ల కు అనుకూలంగా మారింది. ఆంధ్రా చెక్ పోస్టులు ప్రేక్షక పాత్ర పోషిస్తుండటంతో స్మగ్లర్లకు అడ్డుఅదుపు లేకుండాపోయింది. ఒడిశా రాష్ట్రం మీదుగా ఆంధ్రా, తెలంగాణకు భారీగా గంజాయి ని తరలిస్తున్నారు. గతంలో అనేకసార్లు భద్రాచలంలో గంజా యి పట్టుబడగా, ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు స్మగ్లర్లు భద్రాచలం, సమీప ఆంధ్రా ప్రాంతాల్లో మకాం వేసి ఈ అక్రమ గంజాయి రవాణా సాగిస్తున్నట్లు తెలుస్తున్నది.వర్షాకాలం కావడంతో గంజాయి తరలింపునకు అనుకూలమైన పరిస్థితులు ఉండటంతో ఈ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన గంజాయి స్మగ్లర్లు భద్రాచలం పట్టణం, ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో తలదాచుకొని గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. వీరికి స్థానికుల సహకారమున్నట్లు ప్రచారం జరుగుతోంది. కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకునే ప్రయత్నం సీఆర్‌పీఎఫ్ చేయగా, వారిని తప్పించుకొని కారు స్పీడ్‌గా దూసుకెళ్లి డివైడర్‌ను ఢీకొట్టి కారు ఆగింది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. భద్రాచలం సమీప ఆంధ్రా ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంతో కూడుకొని ఉండటంతో ఆయా రహదారులగుండా గంజాయి తరలిస్తున్న వాహనాల స్పీడ్ భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇదిలా ఉండగా భద్రాచలం పట్టణంలో గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయి.

 

ముఖ్యంగా యువత గంజాయికి అలవాటు పడి ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నారు.ఒడిశాలోని చిత్రకొండ, పొల్లూరు, బలిమెల, పెళ్లిబాయి, ఆంధ్రాలోని గుత్తేడు, డొంకరాయి, సీలేరు, కొండ్రాజుకోట తదితర ప్రాంతాల నుంచి గంజాయిని స్మగ్లర్లు రవాణా చేస్తున్నారు. గంజాయిని ప్యాకెట్ల రూపంలో అమర్చి కారు, లారీలు, ఇతర వాహనాల ద్వారా గంజాయిని తరలిస్తున్నారు. ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా మీదుగా సీలేరు, డొంకరాయి తదితర అటవీ ప్రాంతాల ద్వారా ఆంధ్రా, తెలంగాణలోని పట్టణాలకు తరలిస్తున్నారు. ఆంధ్రా ప్రాంతంలో మోతుగూడెం, లక్ష్మిపురం, నెల్లిపాక, చింతూరు, కూనవరం తదితర ప్రాంతాల్లో ఫారెస్ట్, ఎక్సైజ్ తదితర చెక్ పోస్టులు ఉన్నా, స్మగ్లర్లు తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిసుడడం గమనార్హం. ఆయా ప్రాంతాల్లో ఉన్న చెక్ పోస్టులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరు నెలల క్రితం భద్రాచలం పట్టణంలో ని బ్రిడ్జి సెంటర్‌లో రూ.6లక్షలు విలువ చేసే అక్రమ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ట్రాలీలో గంజాయిని పెట్టి పైన వరిగడ్డి వేసి తరలిస్తుండగా, పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద తరలింపుకు సిద్ధంగా ఉన్న గంజాయిని 6 నెలల క్రితం ఎక్సైజ్ సిబ్బంది కాపు కాసి పట్టుకున్నారు. రెండు నెలల క్రితం భద్రాచలం బ్రిడ్జి సెంటర్ వద్ద గంజాయిని పట్టుకొని, తమిళనాడుకు చెందిన ఇద్దరి వ్యక్తులను అరెస్ట్ చేశారు.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags:Arbitrary smuggling of cannabis from Odisha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *