ఆజాదీకా మహోత్సవ్ కు తెలుగు సీఎంలు డుమ్మా..?

హైదరాబాద్  ముచ్చట్లు:

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరౌతారా అన్నది ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికరంగా మారింది. ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చే జరుగుతోంది. మెజారిటీ అభిప్రాయం మాత్రం ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ మీటింగ్ కు డుమ్మా కొడతారనే అంటున్నారు. అందుకు ఇరువురికీ వారి వారి కారణాలున్నాయంటున్నారు. ఈ నెల 6న హస్తినలో ప్రధాని మోడీ అధ్యక్షతన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశం జరగ నుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డుమ్మా కొడతారని తెరాస శ్రేణులే చెబుతున్నాయి.

 

 

 

గత కొంత కాలంగా కేసీఆర్ ప్రధాని మోడీతో భేటీ అయ్యింది లేదు. ఆయనపై తీవ్ర స్థాయి విమర్శలతో విరుచుకుపడుతున్న కేసీఆర్.. ప్రొటో కాల్ ప్రకారం మోడీకి స్వాగతం పలకాల్సిన సందర్భాలలో కూడా మొహం చాటేశారు.మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయన హైదరాబాద్ లో ఉండి కూడా మోడీకి స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి వెళ్లలేదు. కనుక ఆహ్వానం వచ్చిందని ఆయన మోడీ అధ్యక్షతన జరిగే ఆజాదీ కా అమృతోత్సవ్ జాతీయ కమిటీ మీటింగ్ కు వెళ్లతారని ఎవరూ భావించడం లేదు. ఇక జగన్ విషయానికి వస్తే ఆయన సాధారణంగా కేంద్రం నుంచి వచ్చిన ప్రతి ఆహ్వానాన్నీ మన్నిస్తారు. అయితే ఈ సారి ఆయన ఆజాదీ కా అమృతోత్సవ్ జాతీయ కమిటీ భేటీకి డుమ్మా కొట్టే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.ఇందుకు కారణం ఆ సమావేశానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు హాజరౌతుండటమే కారణమని చెబుతున్నారు. ఔను ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కేంద్రం నుంచి చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందింది.

 

 

 

ఆ ఆహ్వానం మేరకు చంద్ర బాబు ఈ నెల 6న ఢిల్లీ వెళ్ల నున్నారు. ఆ కారణంగానే ఈ సమావేశానికి జగన్ డుమ్మా కొడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్   రాజకీయ ప్రత్యర్థులందరినీ వ్యక్తగత శత్రువులుగానే భావిస్తారనీ, ఆ కారణంగానే తనపై విమర్శలు చేస్తున్న సొంత పార్టీ ఎంపీ రఘురామ రాజు భీమవరం లో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు హజరు కాకుండా అడ్డుకున్నారని చెబుతారు. తనను వ్యతిరేకించే వారికి ఎదురుపడటాన్ని కూడా జగన్ సహించరని చెబుతారు.అందుకే విపక్ష నేత చంద్రబాబు హాజరౌతున్న ఆజాదీ కా అమృతోత్సవ్ జాతీయ కమిటీ సమావేశానికి జగన్ డుమ్మా కొట్టే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఆ సమావేశానికి హాజరౌతే జగన్ చంద్రబాబుతో కలిసి కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరో తేదీన ఢిల్లీ వెళ్లబోతున్నారు. “అజాదీ కా అమృత్ మహోత్సవ్” జాతీయ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయనకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి హాజరవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.  రాజకీయాన్ని రాజకీయంగానే చూసే చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.కానీ రాజకీయాన్ని కూడా వ్యక్తిగత శత్రుత్వ స్థాయికి పెంచుకునే జగన్‌కు మాత్రం ఈ భే్టీ ఇబ్బందికరమే.అందుకే ఆయన డుమ్మా కొడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

Tags: Are Telugu CMs silent on Azadika Mahotsav?

Leave A Reply

Your email address will not be published.