రాష్ట్రంలో బీసీలకు శూన్యంవీడిందా..?

Are the BCs in the state vacuum?

Are the BCs in the state vacuum?

– రాజకీయ ప్రత్యామ్నయం రెడీ
– ప్రధాన పార్టీలకు పోటీగా బలమైన అభ్యర్థులు
– దూసుకురానున్న తెలుగు ప్రజాపథం పార్టీ టిపీపీ
– పుంగనూరు నాంది
– రామచంద్రయాదవ్‌ పోస్టర్లు విడుదల

Date:11/01/2019

అమరావతి ముచ్చట్లు:

రాష్ట్ర రాజకీయాలలో తెలుగుప్రజాపథం పార్టీ ప్రత్యామ్నయ రాజకీయ వేదికగా దూసుకొస్తోంది. శూన్యమాసం దాటిన వెంటనే సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణ పుణ్యకాలంలో బీసీ కులస్తుల ఆధ్వర్యంలో యాదవులచే పార్టీ ఆవిర్భావం కానున్నది. ఇందుకు అత్యధికంగా బీసీ కులస్తులు ఉన్న పుంగనూరు నియోజకవర్గం వేదికగా నిలిచినట్లు తెలుస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ ఆధ్వర్యంలో పార్టీ పురుడుపోసుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా సంక్రాంతిని పురస్కరించుకుని నియోజకవర్గంలో బారీ స్థాయిలో రామచంద్రయాదవ్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు వందల సంఖ్యలో ప్లెక్సిలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.

పార్టీలకు బీసీల షాక్‌ ….

రాష్ట్రంలో ఇంత కాలం అన్ని పార్టీలు బీసీల జపం చేసి, వారి ఓట్లతో పబ్బం గడుపుకున్నారు. అధికారంచేజిక్కించుకుని లాభపడ్డ పార్టీలు బీసీ సంక్షేమాన్ని , వారి ఆర్థికాభివృద్ధిని విస్మరించారు. ఈ నేపధ్యంలో బీసీ వర్గాల వేదికగా కొత్త రాజకీయ పార్టీ తెలుగుప్రజాపథం పురుడు పోసుకుంది. ఇప్పుడు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్‌, బిజెపిలకు ధీటుగా అభ్యర్థులను రంగంలోనికి దింపి, పార్టీ సత్తాచాటాలని పార్టీ వ్యవస్థాపకులు వచ్యీహా రచన చేస్తున్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లి నియోజకవర్గాలలో ఎస్సీ, ఎస్టీ రిజిర్వు స్థానాలు మినహాయిస్తే, మిగిలిన స్థానాలలో బీసీలకు చెప్పుకోదగ్గ ప్రాధాన్యత లేదు. ఇప్పుడు ఎన్నికల సంగ్రామానికి ఆసమయం ఆసన్నమైంది. మరో మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్లబోతున్నాం. ఈ పరిస్థితులలో బీసీ ఓట్లతో్య ధికారం దక్కించుకున్న పార్టీలకు దెబ్బతీయ్యాలన్న లక్ష్యంతో తెలుగుప్రజాపథం పార్టీ సిద్దమైంది. ముఖ్యంగా అసెంబ్లి స్థానాలకు అభ్యర్థత్వం ఆశించి, భంగపడే బలమైన అభ్యర్థులను తమ పార్టీ తరపున బరిలోకి దింపి, ప్రత్యేర్థి పార్టీల వెన్నులో వణుకు పుట్టించాలన్న లక్ష్యంతో పావులు కదుపుతోంది. దీనికి అవసరమైన ఎన్నికల ఏర్పాట్ల కోసం చర్యలు ప్రారంభించారు. నూతన పార్టీ ద్వారా ఎన్నికల బరిలోకి దింపే అభ్యర్థులకు పార్టీ ఆధ్వర్యంలో అంగబలం, అర్ధబలాన్ని సమకూర్చేందుకు సిద్దమౌతున్నారు. బీసీల ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలలో అభ్యర్థులను దింపి , ప్రధాన పార్టీలకు రాజకీయంగా ఇబ్బంది పెట్టి, మచ్చెమటలు పట్టించేలా చేయాలన్న యోచన స్పష్టమౌతోంది. బీసీ ఓట్లు తెలుగుప్రజాపథంకే దక్కడం ద్వారా ప్రధాన పార్టీలను దెబ్బతీయ్యవచ్చన్న ఆలోచన కన్పిస్తోంది. ఇదే జరిగితే ఏ పార్టీ నష్టపోతుందో వేచి చూడాల్సి ఉంది.

వాళ్లకు టికెట్లు ఇస్తాం….

టీడీపీ, కాంగ్రెస్‌, బిజెపి , వైఎస్‌ఆర్‌సీపీ, జనసేన పార్టీలలో టికెట్లు దక్కని వేతలకు తెలుగుప్రజాపథం అండగా ఉండేందుకు సిద్దమైంది. ఆపార్టీలలో టికెట్లు ఆశించి, భంగపడే అభ్యర్థులను ఆపార్టీలకే ప్రత్యర్థి అభ్యర్థులుగా నిలబెట్టి, ఓడించాలన్న వచ్యీహం పన్నుతోంది. ఇప్పటికే నియోజకవర్గాలలోని అసంతృప్త పార్టీల నేతలు, అభ్యర్థిత్వాలు దక్కె అవకాశం లేని ఆశవాహులను గుర్తించి, వారిని దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాలు వెహోదలైయ్యాయి.

ప్రజాపథం పార్టీ నేపధ్యం….

రాష్ట్రంలో అత్యధికశాతమైన బీసీ కులస్తులు అన్ని పార్టీలకు షాక్‌ ఇవ్వనున్నారు. బీసీ కులస్తులలో యాదవులు ప్రధాన పాత్ర పోషించనున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలోని ఇద్దరు ముఖ్యనేతలు , రెండు ఉన్నతమైన పదవుల్లో ఉన్న యాదవ నేతలు కలసి ఈ పార్టీకి నాంది పలికినట్లు సమాచారం. ఇందు కోసం నియోజకవర్గాల వారిగా ప్రముఖ యాదవ సభ్యులతో చర్చలు పూర్తి చేశారు. నూతన పార్టీని సంక్రాంతి పర్వదినాన ప్రారంభించనున్నారు. ఈ పార్టీకి రైతు, నాగలి, చెట్టు గుర్తులను తీసుకోవాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ప్రజాపథంలోకి వచ్చే పార్టీలు….

బీసీల పార్టీగా ఆవిర్భవించనున్న తెలుగుప్రజాపథం పార్టీలో యాదవులు, ముస్లింలు , కురబ, వాల్మీకి, బెస్త, నాయిబ్రాహ్మణులు, క్షత్రియులు, కుమ్మరులు, పూసల బలిజ, పెరికిబలిజ, కంసల కులస్తులు , లింగాయితులు, జంగమ కులస్తులు ఈ పార్టీకి దగ్గరకానున్నారు. బీసీల పార్టీగా వస్తున్న తెలుగుప్రజాపథం ఏవిధమైన మార్పులకు శ్రీకారం చుడుతుందోనని పలువురు ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. ఇదే నిజమైతే బీసీల మద్దతును అన్ని పార్టీలు కోల్పోవడం త్యథ్యం .

వీధిలో రెండు పంచాయితీలు

Tags: Are the BCs in the state vacuum?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *