మ‌హారాష్ట్ర‌లో  లెక్క‌లు మారుతున్నాయా

Date:13/10/2020

ముంబై‌ ముచ్చట్లు:

శ‌త్రువు అన్నాక అవకాశమొచ్చినప్పుడు దెబ్బతీయడమే. రాజకీయాల్లో ఇది అత్యంత అవసరం. శత్రువును మానసికంగా ఇబ్బంది పెడితేనే తమ వైపు చూడరన్నది రాజకీయ నేతలు భావిస్తారు. మహారాష్ట్రలోని శివసేన పరిస్థితి కూడా ఇంతే. మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు పదే పదే కెలుకుతున్నారు. ప్రభుత్వం పడిపోతుందని కొందరు జోస్యం చెబితే, మరికొందరు ఎన్సీపీని బీజేపీలో భాగస్వామి కావాలని కోరుతున్నారు. టోటల్ గా బీజేపీ మహారాష్ట్రలో ప్రస్తుతమున్న ప్రభుత్వం ఉండకూడదని కోరుకుంటుంది.చివరకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారాన్ని కూడా బీజేపీ అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే శివసేన ఊరుకుంటుందా? బీజేపీని పరోక్షంగా దెబ్బతీయాలన్న యోచనలో ఉంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ ఇమేజ్ ఉందని బీజేపీ గట్టిగా నమ్ముతుంది. కానీ కరోనాతో మోదీ ఇమేజ్ గాలికి కొట్టుకుపోయిందన్నది శివసేన భావన.

 

గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు మోదీకి లేవంటున్నారు.మోదీ ఇమేజ్ ను తేల్చే విషయం బీహార్ ఎన్నికల్లోనే తేలుతుందంటున్నారు. కరోనాలో జరుగుతున్న తొలి రాష్ట్ర ఎన్నికలు కావడంతో బీహార్ రాజకీయం ఇప్పటికే హీటెక్కింది. బీహార్ లో ఎన్డీఏ కూటమి బలంగా ఉందని చెబుతున్నా లోలోపల మాత్రం కమలనాధులకు భయంగానే ఉంది. అందుకే అన్ని అస్త్రాలను ఉపయోగిస్తుంది. తేజస్వి యాదవ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో కొంత ఊపిరి పీల్చుకున్న నితీష్ కుమార్, మోదీపై ఉన్న వ్యతిరేకత విజయావకాశాలపై ప్రభావం చూపుతుందనే వారూ లేకపోలేదు.ఈ సమయంలో శివసేన బీహార్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. మొత్తం నలభై నీట్లలో పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ చెప్పారు. బీహార్ ఎన్నికలలో శివసేన పోటీ చేయడానికి రెండు లక్ష్యాలనున్నాయి. ఒకటి బీహార్ లో హిందు ఓటు బ్యాంకులో చీలిక తెచ్చి బీజేపీని నష్టపర్చడం. రెండోది సుశాంత్ ఆత్మ హత్య కేసులో బీహార్ బీజేపీ నేతలు చేసిన ఆరోపణలకు ధీటుగా ఎన్నికల ద్వారానే సమాధానం చెప్పాలనుకోవడం. శివసేన నలభై స్థానాల్లో పోటీ చేస్తే అది బీజేపీకి కొంత ఇబ్బందికరమేనని అంటున్నారు విశ్లేషకులు.

 

 మ‌హాకూట‌మీ సీఎంగా తేజ‌స్వీ

Tags:Are the calculations changing in Maharashtra?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *