Date:04/12/2020
హైదరాబాద్ ముచ్చట్లు:
రెడ్డి కాంగ్రెస్.. టీడీపీ.. ప్రజారాజ్యం.. వైసీపీ.. జనసేన అన్నీ కులం కట్టుబాట్లు మీరవు. రిజర్వేషన్ల లెక్కలు వదిలేస్తే.. ప్రతి పార్టీ ఆ కులం స్టాండ్ నుంచి పక్కకి జరగవు. ఎవరు ఒప్పుకోకున్నా.. ఇది హండ్రడ్ పర్సంట్ నిజం అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ.. లెక్కలు మారాయి. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత.. కులం సెంటిమెంట్ తగ్గింది. ప్రాంతం అనే నినాదం ముందు.. కుల పీలింగ్ ఓడిపోయింది. జనం మర్చిపోయారు.ఫర్ ఏ చేంజ్. ఇప్పుడు లెక్కలు మారాయి. తెలంగాణ వచ్చిన తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుల నినాదం ఊపందుకుంది. అంతే కాదు. ఇదే టైంలో.. మత నినాదం కూడా జనాల్లో బలంగా నాటుకుంటోంది. ఇన్నాళ్లూ … నార్త్ లోనే మత నినాదం ఉండేది. మన దగ్గర కేవలం కుల నినాదం మాత్రమే ఉండేది. ఇప్పుడు అలా కాదు. రెండూ పెరిగాయి. ఎవరి లెక్కల్లో వాళ్లు ఉండిపోయారు.తెలంగాణలో ఇప్పుడు ప్రాంత నినాదం తగ్గిపోతుంది. ఇన్నాళ్లూ ప్రాంతం పేరు చెప్పి.. నినాదాలు చేసిన లీడర్లు చప్ప బడిపోయారు. మనం మనం జనం జనం అంటున్నారు. కానీ.. ఇదే టైంలో కుల కుంపట్లు పెరిగిపోయాయి.
దొర వర్సెస్ రెడ్డి అన్నట్లు నడుస్తోంది. ఎక్కువ శాతం మంది ఉన్న కులం రెడ్డి.. ఎక్కువ పవర్ లో ఉన్న కులం దొర కావడంతో.. ఫైట్ రెండు కులాల మధ్యనే నడవబోతుంది.ఓటర్లు.. మిగతా కులాల లీడర్లు కూడా ఈ రెండు సామాజిక వర్గాల వారికి జై కొడుతూ వెనకాల నడవక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. కానీ.. ఇదే టైంలో.. మతం రంగు పులుముకుంటోంది తెలంగాణ. నార్త్ నుంచి వచ్చిన కమల దళం.. కాషాయ రంగు పులుముతోంది. ఆల్రెడీ గ్రేటర్ ఎన్నికలతో స్టార్ట్ అయింది. ముందు ముందు ఈ కుల కుంపట్లు.. మతం రంగు ఎంత దాకా పోతుందో చూడాలి. ఈ మతం రంగుని.. దొరలు.. రెడ్లు.. ఎలా ఓవర్ టేక్ చేస్తారో అనేది కూడా బిగ్ క్వశ్చనే. చూస్తుంటే.. దొర వర్సెస్ రెడ్డిలా ఉన్న రాజకీయాలు.. ట్రయాంగిల్ లోకి మారిపోతాయి అనిపిస్తోంది.
Tags: Are the calculations changing in Telangana …