నెలవంక, నక్షత్రాలతో కూడిన ఆకుపచ్చ రంగు జెండాలు దేశంలోనిషేధం?

Date:16/07/2018
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
నెలవంక, నక్షత్రాలతో కూడిన ఆకుపచ్చ రంగు జెండాలను దేశంలో ఎగరవేయరాదంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. దేశ వ్యాప్తంగా భవనాలు, మతపరమైన ప్రాంతాల్లో ఈ జెండాలను నిషేధించడంపై అభిప్రాయం చెప్పాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఆకుపచ్చరంగు జెండాలపై షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ సయీద్ వసీమ్ రిజ్వీ వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరపున సమాధానం చెప్పేందుకు వీలుగా అదనపు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా‌కు ఈ పిటిషన్ తాలూకు కాపీలను అందించాలని రిజ్వీకి ధర్మాసనం సూచించింది.నెలవంక,నక్షత్రంతో కూడిన ఆకుపచ్చ జెండాలు ఇస్లాం విరుద్ధమనీ, పాకిస్తాన్‌లోని ఓ రాజకీయ పార్టీ జెండాను తలపించేలా ఉన్నాయంటూ రిజ్వీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ముంబై సహా దేశంలోని పలు ప్రాంతాల్లో అనేక భవనాలు,మత కట్టడాలపై తాను ఈ జెండాలను చూశాననీ… ఇవి హిందూ,ముస్లింల మధ్య ఉద్రిక్తతలను పెంచేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. మన శత్రు దేశం, పాకిస్తాన్‌‌లోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ జెండాను తలపించేలా ఇవి ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఆకుపచ్చ రంగు నేపథ్యంలో నెలవంక, నక్షత్రం అనేవి ఇస్లాం సంప్రదాయంలో ఎప్పుడూ భాగం కాదనీ… ఇస్లాంలో వాటికి ఎలాంటి పాత్ర, ప్రాధాన్యత లేదని రిజ్వీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
నెలవంక, నక్షత్రాలతో కూడిన ఆకుపచ్చ రంగు జెండాలు దేశంలోనిషేధం?https://www.telugumuchatlu.com/are-the-green-and-yellow-colored-flags-in-the-country/
Tags: Are the green and yellow colored flags in the country?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *