నగరవనానికి గిరిజనుల భూములా..?
సి పి ఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ మావులూరి విశ్వనాథ్
రాయచోటి ముచ్చట్లు:
కొన్ని దశాబ్దాలు అనుభవం లో ఉన్న గిరిజన భూముల జోలికి రావద్దు అని సి పి ఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ అన్నమయ్య జిల్లా నాయకులు మావులూరి విశ్వనాథ్ అన్నారు రాయచోటి మండల పరిధిలోని ఎగువ అబ్బవరం తాండాలొ ఉన్న గిరిజనుల భూముల ను సి పి ఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా కావడం వల్ల ప్రభుత్వ స్థలాలు కబ్జా దారుల కు వదిలేసి నగరవనం పేరు తో కేవలం గిరిజనుల భూముల ను లాక్కోవడానికి సిద్ధం అయ్యారు అన్నారు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి గిరిజనుల భూముల జోలికి రావద్దు అని ఆయన అన్నారు అధికార పార్టీ నేతలే ఇటువంటి కార్యక్రమాలు అధికారులను పురిగొల్పింది అని ఆయన అన్నారు ఇప్పటికైనా గిరిజనుల కు అన్యాయం చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు గిరిజనుల భూముల జోలికి వస్తే కచ్చితంగా అడ్డుకుంటా మన్నారు ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాయచోటి మండల అధ్యక్షులు పెధ్ది నాయుడు మండల సహాయ కార్యదర్శి చలపతి ఐ ఎఫ్ టి యు నాయకులు దార్ల మదన్ మోహన్ రైతు కూలీ సంఘం నాయకులు తది తర్లు పాల్గొన్నారు.

Tags: Are the tribal lands for the city?
