నేను ఊరికి ఇది చేశాను అని చెప్పుకునే రాజకీయ నాయకులున్నారా..!

ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి .

 

తిరుపతి ముచ్చట్లు:

ప్రసన్న భారతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.ఈ సమావేశంలో మాట్లాడుతూ నా చిన్నప్పుడు నుంచి తిరుపతిని చూస్తూనే ఉన్నాను. ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు. అవే ఇరుకు రోడ్లు.. అవే గుంతలు.దీంతో ఎక్కడకి వెళ్లాలన్నా చిన్న చిన్న సంధులు.. ట్రాఫిక్ కష్టాలతో అవస్థలు. అప్పుడు అనుకున్నాను నా తిరుపతిని మెట్రో సిటీలతో పోటీగా నిర్మించాలని. అందుకే డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ముందుగా మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించాలని నిశ్చయించుకున్నాను.భారతదేశంలో ఏకకాలంలో 18మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసిన చరిత్ర మన తిరుపతిలోనే జరిగిందని సగర్వంగా తెలియజేస్తున్నాను.మీరు రోజూ ఉపయోగిస్తున్న ఈ కొర్లగుంట రోడ్డు ఇంతకు ముందు ఎలా ఉండేది.. ఆటోలు కూడా తిరగలేని పరిస్థితి.. అదే ఇప్పుడు ఏకకాలంలో రెండు మూడు అంబులెన్సులు రయ్ రయ్ అంటూ స్వేచ్ఛగా తిరుగుతున్నాయి.తిరుపతి నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కేంద్ర మంత్రులు కూడా అయ్యారు. కానీ నేను తిరుపతికి ఇది చేశాను అని చెప్పగలిగే దైర్యం వారికి లేదు.కానీ నేను రెండేళ్ల కాలంలోనే పెద్ద నగరాలతో మన తిరుపతి కూడా పోటీ పోటీపడేలా 18మాస్టర్ ప్లాన్ రోడ్లు, 7ఫ్రీలెఫ్టు రోడ్లు, 5స్లిప్వే రోడ్లు, నగర సుందరీకరణ చేశాను. భవిష్యత్తులో మరో 14మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించబోతున్నాము.

 

 

 

ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నాను..? మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని మన ఊరుకి IT కంపెనీలు తీసుకురావాలనేది నా ప్రణాళిక. ఇదివరకే పలు మిడ్ సైజ్ IT కంపెనీలను సంప్రదించాను. వారికీ అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చాను.ఇందులో భాగంగా తిరుపతిని నేరరహిత నగరంగా ఉండేలా హత్యలు, దొంగతనాలు వంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా IOT, AI టెక్నాలజీ ఉపయోగించి 4000 సీసీ కెమెరాలు అమర్చేలా ప్రణాళికలు రుపొందిస్తున్నాం.రానున్న రోజుల్లో పరిశుభ్రత విషయంలో తిరుపతిని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెడతాను అని మాట ఇస్తున్నాను.కొంతమంది అనాలోచిత స్వలాభ ప్రయోజనాల కోసం ఆలస్యం అయ్యిందే తప్ప.. కచ్చితంగా పారిశుద్ధ్యం ప్రక్షాళన చేయాల్సిన అవసరం వుంది.ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరుతున్నాను..

 

Tags: Are there politicians who say that I have done this to the village..!

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *