ప్రాజెక్టు కట్టమని అర్జీలిచ్చిన వారే అడ్డుకోవడమా.?
-ఆరు మండలాలకు లబ్ధి
– ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి
సోమల ముచ్చట్లు:

పడమటి మండలాలైన సోమల, సదుం, రొంపిచెర్ల, పులిచెర్ల , పీలేరు మండలాల్లోని రైతుల శ్రేయస్సు కోసమే ఆవులపల్లె ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తెలిపారు. శనివారం ప్రాజెక్టు సాధన కమిటి ఆధ్వర్యంలో రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల క్రితం సీతమ్మ చెరువులో ప్రాజెక్టు నిర్మించమని అర్జీలు ఇచ్చి తిరిగిన వారే ఈరోజు అడ్డుకోవడం దయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు అందించే మహాత్తర పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేశారన్నారు. దీనిని చంద్రబాబు అండ్‌కో అడ్డుకోవడం బాధకరమన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నిన ఎన్ని స్టేలు తెచ్చిన ప్రజల ఆశీస్సులతో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కన్వీనర్ గంగాధర్, ఎంపీపీ ఈశ్వరయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్లు అమాస మోహన్, నాగేశ్వరరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శీలం భాస్కర్, మండల ఉపాధ్యక్షుడు నాగభూషణం రెడ్డి, యూత్‌య్అధ్యక్షుడు కుమార్ రాజ, మైనారిటీ అధ్యక్షుడు మస్తాన్ వలీ,వైస్ ఎంపీపీలు ప్రభాకర, సయ్యద్‌బాషా, జేసీఎస్ మండల కన్వీనర్ రాశెట్టి మధు,నేతలు సరస్వతమ్మ, గణపతి, జీలానీ, కొదండరాజు,సర్పంచులు, ఎంపీటీసీ పాల్గొన్నారు.
Tags; Are those who applied to build the project blocking it?
