Natyam ad

అసలు మీరు మనుషులా..మృగాలా చంద్రబాబూ?

– మీ స్వార్ధ రాజకీయాలకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంటారా?
– తన కుటుంబానికి 4 పథకాలొచ్చాయని చెప్పడం కూడా తట్టుకోలేకపోతున్నారా?
– ఇందుకేనా కోట్లు వెచ్చించి మీరు సోషల్‌ మీడియా నడుపుతున్నది..?
– మీ పాపాలు పండే సమయం వచ్చేసిది చంద్రబాబు,పవన్‌ కల్యాణ్‌.
– చట్టపరంగా టీడీపీ,జనసేన సోషల్‌ మీడియా మూకలపై చర్యలు తీసుకోవాలి.
– ఆ కుటుంబానికి రూ.20 కోట్లు ఎక్స్‌గ్రేషియా ఇచ్చిన సీఎం జగన్ కి ధన్యవాదాలు
-: ఎమ్మెల్సీ   పోతుల సునీత.

వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ   పోతుల సునీత

టీడీపీ, జనసేన రాబంధుల చేతుల్లో గీతాంజలి బలి:

 

Post Midle

తాడేపల్లి ముచ్చట్లు:

– టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా రాబంధుల వికృత చేష్టలతో గీతాంజలి అనే బీసీ మహిళ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు.
– ఇద్దరు చిన్నారులున్న ఒక మహిళను వీరి సోషల్‌మీడియా పొట్టన పెట్టుకుంది.
– అసలు వీళ్లు మనుషులేనా..? మృగాలా? సమాజంలో మానవత్వాన్ని మంట కలిపి సాధారణ మహిళను చూసి కళ్లు మండాయి.
– మీ స్వార్ధ రాజకీయాల కోసం సామాన్య మహిళను బలితీసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు?
– గీతాంజలి చేసిన తప్పేంటి? తను ఒక లబ్ధిదారుగా తనకు ఇల్లు వచ్చిందని సంతోషాన్ని వ్యక్తపరచడం కూడా తట్టుకోలేకపోతున్నారు.
– తన కూతురికి అమ్మ ఒడి వచ్చింది.. తన అత్తకు చేయూత, తన మామకు పింఛన్‌..మొత్తం తన ఇంట్లో నాలుగు పథకాలు వచ్చాయని చెప్పడం ఈ పచ్చ మందకు కళ్లు మండాయి.
– అలా చెప్పినందుకు ఈ దుర్మార్గులు కిరాతకంగా ఆమెను సోషల్‌మీడియాలో వ్యక్తిగతంగా దూషణలకు దిగారు.
– వీరి వేధింపులకు తట్టుకోలేక ఆ సాధారణ మహిళ మానసిక ఆవేదన చెంది తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది.
– అభం శుభం తెలియని ఒక మహిళతో ఆడుకున్న మీఅంత నీచులు ఎవరైనా ఉంటారా?

 

 

 

ఇందుకేనా మీరు కోట్లు వెచ్చించి సోషల్‌ మీడియా నడుపుతున్నది?:

– చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ లను సూటిగా అడుగుతున్నాను. మీరు పార్టీ తరఫున కోట్లు వెచ్చించి సోషల్‌ మీడియాను నడుతున్నది అమాయక ప్రజలను బలిగొనేందుకునేనా?
– జగనన్న రాజ్యంలో ఎంతో సంతోషంగా మహిళలు ఉంటే మీకు నచ్చడం లేదు. ఈర్ష పడుతున్నారు.
– మీ ప్రభుత్వంలో ఇలాంటి సేవలు ఏమీ చేయలేదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు మహిళలు గుర్తు పెట్టుకోవడానికి ఒక్క పథకమైనా పెట్టాడా?
– ఓట్ల కోసం మహిళలను వంచించి, దగా చేసింది మీరు కాదా?
– 2014లో డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 14వేల కోట్లు రుణ మాఫీ చేస్తానని ఓట్లేయించుకుని దగా చేసింది నువ్వు కాదా బాబూ?
– ఏనాడైనా ఒక ముఖ్యమంత్రిగా నువ్వు మహిళలను గౌరవించావా?
– ఈ రోజు అధికార దాహంతో సామాన్య మహిళలను, సమాజంలో సేవ చేసే వాలంటీర్లను, చదువుకునే చిన్న పిల్లలను మీ సోషల్ మీడియాలో ఇష్టారీతిన ట్రోల్‌ చేస్తున్నారు.

 

 

– బడుగు బలహీన వర్గాల పిల్లలు.. అంతర్జాతీయ వేదికల్లో ఇంగ్లీషులో మాట్లాడటాన్ని కూడా తట్టుకోలేక వారిపైనా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.
– ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. రాష్ట్రం నుంచి వెలివేస్తారు.

మీ పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది:
– మీ పాపాలు పండే సమయం కూడా ఆసన్నమైంది చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ తెలుసుకోవాలి.
– చట్టపరంగా టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా మూకలు ఎవరైతే గీతాంజలి మరణానికి కారణమయ్యారో వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి.
– మహిళల రక్షణ కోసం జగనన్న దిశ చట్టం, దిశ యాప్‌ తీసుకొచ్చారు.
– గ్రామ సచివాలయాల్లో ఒక మహిళా కానిస్టేబుల్‌ను నియమించారు.
– మహిళలకు భారీగా మేలు జరుగుతుంటే ఓర్చుకోలేక చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్, ఉత్త పుత్రుడు లోకేశ్‌ పచ్చ మీడియాను ఆసరాగా చేసుకుని విషం కక్కుతున్నారు.
– ఏనాడైనా ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు మీరు న్యాయం చేశారా?
– బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప చంద్రబాబు హయాంలో న్యాయం జరిగిందా?

 

 

– నాలుగు ఇస్త్రీ పెట్టెలిస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని చంద్రబాబు అనుకుంటే పొరపాటే.
– ఈ రోజు బీసీలు ఆ పరిస్థితిలో లేరు. జగనన్న ప్రభుత్వంలో ఎంతో గౌరవంగా బీసీలున్నారు.
– మహిళలకు రాజ్యాధికారం ఇస్తూ నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం ఇచ్చారు.
– దేశంలో మహిళా సంక్షేమంలో జగనన్న ఒక రోల్‌ మోడల్‌గా నిలబడ్డారు.
– ఇవన్నీ చూసి ఓర్చుకోలేక మీ పచ్చ మీడియా, సోషల్‌ మీడియాను అడ్డుపెట్టుకుని ఏదో చేయాలంటే చెల్లదు.
– మీ పాపాలు పండే రోజులు దగ్గరపడ్డాయి. ఈ రాష్ట్రంలో 80 శాతం మంది మహిళలు ప్రభుత్వ పథకాలు అందుకున్నారు.
– జగనన్న ప్రభుత్వంలో మహిళలు సంతోషంగా ముందుకు వెళ్తున్నారు. 2024లో మిమ్మల్ని తరిమికొట్టేది ఆ మహిళలే.
– టీడీపీకి చెందిన సజ్జా అజయ్‌ అనే వ్యక్తి గీతాంజలిని ట్రోల్‌ చేసి మృగాల్లా వ్యవహరించారు.
– ముఖ్యమంత్రి  కూడా ఈ సంఘటన విని దిగ్భ్రాంతికి గురయ్యారు.
– సీఎంగారు ఎంతో బాధపడుతూ ఆ కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంపై ఒక మహిళగా ధన్యవాదాలు తెలుపుతున్నా.
– మృతురాలు బిడ్డల చదువుల బాధ్యత కూడా జగనన్నే చూసుకుంటాను అని చెప్పడం పట్ల కూడా కృతజ్ఞతలు.

 

Tags: Are you a human being or a beast Chandrababu?

Post Midle