మీది షరతులతో కూడిన పొత్తా?సిగ్గులేని పొత్తా?

Are you in a state of uncertainty?

Are you in a state of uncertainty?

ఉత్తమ కుమార్ రెడ్డికి మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ
Date:09/10/2018
హైదరాబాద్‌  ముచ్చట్లు:
మీది షరతులతో కూడిన పొత్తా, సిగ్గులేని పొత్తా స్పష్టం చేయాలన్నారు మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా కాంగ్రెస్‌ పార్టీ పొత్తులు పెట్టుకుంటోందని విమర్శించారు. తెలంగాణ శాసనసభాపక్ష కార్యాలయంలో మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, చింతా ప్రభాకర్‌తో కలిసి మంత్రి మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహా కూటమి ఏర్పాటు నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుదు ఉత్తమ కుమార్ రెడ్డి కి 12 అంశాలతో కూడిన బహిరంగ లేఖ సందిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడితో పొత్తు వల్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న భయాందోళనలను నివృత్తి చేయాలని లేఖలో ప్రధానంగా ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు.
అడుగడుగునా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడంపై కాంగ్రెస్‌ పార్టీ ఏం సమాధానం చెబుతుందని హరీశ్‌రావు ప్రశ్నించారు. సాగునీటి రంగం, ఆస్తుల పంపకం, హైకోర్టు విభజన సహా అనేక అంశాలపై చంద్రబాబు అడ్డుపడుతున్నారని.. ఆయనపై ఆధారపడిన ప్రభుత్వం తెలంగాణలో వస్తే రాష్ట్ర ప్రయోజనాలకు గండి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పటికీ ఆంధ్రా బాబేనని.. తెలంగాణ పక్షం ఆయనెప్పుడూ ఉండరన్నది జగమెరిగిన సత్యమన్నారు. కృష్ణా జలాల పంపకం అంశంలో చంద్రబాబు ఏ పక్షం నిలబడతారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.
చంద్రబాబుతో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు షరతులతో కూడినదా? భేషరతుగా పెట్టుకుంటున్నదా? అన్ని స్పష్టత ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలు ఏమైపోయినా సరే.. అధికారమే ముఖ్యమన్న ధోరణి కాంగ్రెస్‌ పార్టీలో కనిపిస్తోందని విమర్శించారు. 2009లో తాము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి వాస్తవమేనని.. అయితే అది షరతులతో కూడుకున్నదని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకుండా చంద్రబాబు చివరివరకు అడ్డుపడ్డారని.. అప్పుడు ఆయన ఏమైనా తీర్మానం చేసి ఉంటే ఆ కాగితాన్ని ప్రజల ముందు పెట్టాలని డిమాండ్‌ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు 30లేఖలు రాశారని.. ఇప్పుడు ఆ ప్రాజెక్టు సక్రమమైనదేనని ఆయన మీకేమైనా లేఖ ఇచ్చారా? అని కాంగ్రెస్‌ పార్టీని నిలదీశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1200 మంది విద్యుత్‌ ఉద్యోగులను ఆంధ్రాకు బదిలీ చేశారని.. అయితే వారిని విధుల్లోకి తీసుకోకుండా కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని హరీశ్‌రావు తెలిపారు. వారందరికీ తెలంగాణ ప్రభుత్వమే జీతాలు ఇస్తోందన్నారు. మహాకూటమి విడుదల చేసే మేనిఫెస్టోలో తన ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారని ఆశిస్తున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు.
Tags:Are you in a state of uncertainty?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *