వై ఎస్ ఆర్ చేయూతకు మేము అర్హులం  కాదా ! “” కర్లపూడి గ్రామ మహిళల ఆవేదన

Date:11/08/2020

నెల్లూరు ముచ్చట్లు:

తక్షణమే అధికారులు స్పందించి అర్హుల జాబితాలో జతపర్చాలని కర్లపూడి గ్రామ బాధితులు తమ ఆవేదనను లెక్క పరుస్తున్నారు.
తమ పేర్లు అర్హుల జాబితాలో లేకపోవడం గ్రామ వాలింటర్,సచివాలయ సిబ్బందేనని బాధితులు ఆవేదనకు గురవుతున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వై ఎస్ ఆర్ చేయూత పింఛన్ పథకం క్రింద 45 సంవత్సరాలనుండి 60 సంవత్సరాల వరకు ఉండే మహిళలుకు సంవత్సరానికి 18,750 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలకు గానూ  మొత్తం ఒక్కో మహిళకు 75,000 వేల రూపాయలు అందజేస్తున్నట్లు అందరకి తెలిసిన విషయమే.అయితే మొట్టమొదటగా ఇవ్వబోయే 18,750 రూపాయలును బుధవారం రోజున ఇవ్వబోతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.ఈ పథకం ఎస్సి,ఎస్టీ,బీసీ,మైనారిటీ లకు అర్హతలు ఉంటాయని ప్రభుత్వం ఇదివరకే తెలియజేయడం జరిగింది.ఈ నేపథ్యంలోనే ఎన్నో ఆశలతో 45 సంవత్సరాలనుండి 60 సంవత్సరాల వయస్సులో ఉండే మహిళలు సంతోషంగా అర్హతలుకు కావాల్సిన అన్నీ సర్టిఫికెట్ లను సంబందించిన గ్రామ వాలింటర్,సచివాలయ సిబ్బంది వద్ద అందజేయడం జరిగింది.వై ఎస్ ఆర్ చేయూత క్రింద మొట్టమొదటిగా తీసుకోబోతున్న నగదు కుటుంబ ఆర్థిక పరిస్థితులును మెరుగుపర్చు కోవచ్చుననే సంతోషంలో ఉండగా స్థానిక గ్రామ వాలింటర్ మీ పేర్లు అర్హులు జాబితాలో లేవని చెప్పగా ఒక్కసారిగా ఆయా మహిళలు హవాక్కుయ్యారు.

ఈ సంఘటన కోట మండలంలోని సిద్దవరం సచివాలయం పరిధిలో వచ్చే కర్లపూడి పంచాయతీ లో గత కొన్ని సంవత్సరాలనుండి నివాసం ఉంటున్న ముగ్గురు మహిళలైన 1.కర్లపూడి.బుజ్జమ్మ భర్త లేట్. గోపాలయ్య 2.కర్లపూడి.అన్నమ్మ భర్త లేట్ సుధాకర్ 3.జరుగుమల్లి.బుజ్జమ్మ భర్త వెంకట సుబ్బయ్య అనే వీరికి అర్హుల జాబితాలో లేవని సంబందించిన గ్రామ వాలింటర్ పుచ్చలపల్లి.వనజ తెలియజేయడం హాస్యాస్పదం గా ఉందని ఆ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమ పేర్లు జాబితా లో లేకపోవడం వాలింటర్,పంచాయతీ కార్యదర్శి,సచివాలయం సిబ్బంది నిర్లక్ష్యమా అని వాపోతున్నారు.అదేవిధంగా కర్లపూడి పంచాయతీ లో 6 మంది గ్రామ వాలింటర్లు ఉండగా మిగతా ఐదు మంది పరిధిలో ఉండే అర్హులైన మహిళలు పేర్లు వచ్చాయని కానీ తమ వాలింటర్ పరిధిలో ఉన్న ముగ్గురు పేర్లు లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతం జరిగిన విషయంపై మండల అభివృద్ధి అధికారులు పరిశీలించి ఎక్కడ లోపం జరిగిందో విచారణ చేసి తమకు న్యాయం చేయాలనీ వేడుకుంటున్నారు.

 

 బాధితులకు న్యాయం జరిగేవరుకు మా పార్టీ అండగా ఉంటాం

Tags:Aren’t we entitled to YSR! “” Awareness of Karlapudi village women

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *