ఎక్కడికక్కడే కొనసాగిన ఆరెస్టులు

Date:20/01/2020

అమరావతి ముచ్చట్లు:

రాజధాని అమరావతికి మద్దతుగా అమరావతి పరిరక్షణ సమితి రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఛలో అసెంబ్లీ ముట్టడిని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. కాకినాడలో  సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబును అయన నివాసంలో హౌజ్ అరెస్ట్ చేసారు. పలువురు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లును ముఖ్య నాయకులును హౌస్ అరెస్ట్ చేసారు. విజయవాడకు బయల్దేరిన విజయనగరం జిల్లా టీడీపీ నేతలను పోలీసులు పలు చోట్ల హౌస్ అరెస్టు చేశారు. పలువురు మాజీ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. విజయనగరంలోని పార్టీ కార్యాలయమైన అశోక్ బంగ్లాలో మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుతో పాటు ఆయన కుమార్తె అదితి గజపతిరాజు, ఇతర నేతలను కూడా పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా  800 మందికి పైగా తెలుగుదేశం నాయకులను ఇల్లు వదిలి బయటకు రావద్దంటూ నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారరు. అలాగే విశాఖలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణను, రాజమండ్రిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

విశాఖ కేరాఫ్ క్రైమ్

Tags: Arerests that continued on the spot

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *