Natyam ad

అర్జున్ చక్రవర్తి – జర్నీ ఆఫ్ యాన్ అన్‌సంగ్ ఛాంపియన్’ నుంచి ఆసక్తిని రేకెత్తించే ఫస్ట్ లుక్ విడుదల

హైద్రాబాద్ ముచ్చట్లు:

 

రాబోయే చిత్రం “అర్జున్ చక్రవర్తి, జర్నీ ఆఫ్ యాన్ అన్‌సంగ్ ఛాంపియన్” ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీని గుబ్బల నిర్మాత. నటుడు విజయ రామరాజు, సిజా రోజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అజయ్, దయానంద్ రెడ్డి, అజయ్ ఘోష్ మరియు దుర్గేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.”అర్జున్ చక్రవర్తి” చిత్రం 1980లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన కబడ్డీ ఆటగాడి నిజ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. ఇది ఒక క్రీడాకారుడి జీవితంలోని కష్టాలను, విజయాలను సహజంగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ సాగే చిత్రం. ఈరోజు ఈ చిత్రం నుంచి విజయ రామరాజు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు మేకర్స్.ఫస్ట్ లుక్‌లో అర్జున్ చక్రవర్తి స్టేడియం మధ్యలో చేతిలో పతకంతో, ముఖంలో అనుకున్నది సాధించానన్న గర్వంతో కనిపించడం చూడవచ్చు. “భారత కబడ్డీపై అర్జున్ చక్రవర్తి ప్రభావం, 1980లలో భారత క్రికెట్‌పై కపిల్ దేవ్ ప్రభావం స్థాయిలో ఉంటుంది” అంటూ రాసిన అక్షరాలు సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్ళాయి. అలాగే అర్జున్ యొక్క స్ఫూర్తిదాయకమైన కథ గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. త్వరలోనే వెండితెరపై ఈ అద్భుతమైన కథను చూడబోతున్నాం. క్రీడాకారుడి పాత్ర కావడంతో భారీ కసరత్తులు చేసి విజయ రామరాజు తన దేహాన్ని ఎంతో దృఢంగా మలిచారు.
ఈ సినిమా కోసం అత్యున్నత సాంకేతిక బృందం పని చేస్తోంది. విఘ్నేష్ బాస్కరన్ సంగీతం సమకూరుస్తుండగా, జగదీష్ చీకాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సుమిత్ పటేల్ ఆర్ట్ డైరెక్షన్, ప్రదీప్ నందన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. “అర్జున్ చక్రవర్తి” తెలుగు మరియు తమిళ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడింది. హిందీ, మలయాళం, కన్నడ భాషలలో డబ్ చేయబడి, పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది.నిర్మాత శ్రీని గుబ్బల మాట్లాడుతూ, ” అర్జున్ చక్రవర్తి అనేది కేవలం సినిమా మాత్రమే కాదు, సవాళ్లను అధిగమించి, మనందరికీ స్ఫూర్తినిచ్చే వ్యక్తులకి నివాళి అని మేము నమ్ముతున్నాము. అర్జున్ చక్రవర్తి అనేది పోరాటతత్వం, సంకల్పం, కలల సాధన గురించి తెలిపే కథ. ఈ చిత్రం ద్వారా మేము మానవ సంకల్ప శక్తిని ప్రదర్శించాలనుకుంటున్నాము.ఒక టీమ్ గా, మేము ఇప్పటివరకు సాధించిన దాని పట్ల చాలా గర్వంగా ఉన్నాము. ఈ కథకు జీవం పోయడంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇలా చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరి నుండి మాకు లభించిన మద్దతుకు మేము రుణపడి ఉంటాము. సినిమాటోగ్రఫీ నుండి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు ఈ చిత్రంలోని ప్రతి అంశం ప్రేక్షకులకు సినిమాలో లీనమయ్యేలా చేస్తూ భావోద్వేగ అనుభవాన్ని అందించేలా ఉంటుంది.

 

 

 

Post Midle

అర్జున్ చక్రవర్తి యొక్క అద్భుతమైన జీవితాన్ని వెండితెర పైకి తీసుకొస్తూ, ఈ స్ఫూర్తిదాయకమైన కథను అందరికీ చేరువ చేస్తున్నాము. కాబట్టి, ఈ ఆకర్షణీయమైన ప్రయాణంలో మాతో చేరాలని మేము ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాము. ఇది చెప్పడానికి అర్హమైన కథ. ఈ అసాధారణమైన సినిమా ప్రయత్నం గురించి మీ అందరితో మరిన్ని విషయాలు పంచుకోవడానికి మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం.” అన్నారు.దర్శకుడు విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ, ” అర్జున్ చక్రవర్తి చిత్ర దర్శకుడిగా, ఈ స్ఫూర్తిదాయకమైన చిత్రానికి దర్శకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. అర్జున్ చక్రవర్తి కథకు జీవం పోసే ప్రయాణం అపురూపమైనది.
అంకితభావం, పట్టుదల, తనపై అమితమైన నమ్మకంతో విజయం పుడుతుంది అనే దానికి అర్జున్ చక్రవర్తి జీవితం నిదర్శనం. అర్జున్ చక్రవర్తిని గౌరవించడం, ఆయన కథని చెప్పడం పట్ల సమానమైన అభిరుచిని కలిగి ఉన్న తారాగణం మరియు సిబ్బందితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది.
ఈ చిత్రం ద్వారా, అర్జున్ చక్రవర్తి తన ప్రయాణంలో ఎదుర్కొన్న భావోద్వేగాలు, విజయాలు మరియు సవాళ్లను సహజంగా చూపించడానికి ప్రయత్నించాము. ఫస్ట్ లుక్ ప్రేక్షకులు ఏమి ఆశించవచ్చు అనేది తెలుపుతుంది. ఆకట్టుకునే కథనం, అద్భుతమైన ప్రదర్శనలు మరియు అసమానతలను ధిక్కరించిన అసాధారణ వ్యక్తి యొక్క సెలబ్రేషన్ ని ఆశించవచ్చు.అర్జున్ చక్రవర్తి పాత్రని విజయ్ రామరాజు నిజంగా అద్భుతంగా పోషించారు. అర్జున్ చక్రవర్తి పాత్రకు ప్రాణం పోయడం కోసం ఆయన చూపించిన అంకితభావం, నిబద్ధత తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. అర్జున్ చక్రవర్తి పాత్రకి తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకోవడం కోసం ఎన్నో కసరత్తులు చేశారు. ఆయన నటనకు ప్రేక్షకులు కదిలిపోతారని, స్ఫూర్తి పొందుతారని మేము నమ్ముతున్నాము.ప్రొడక్షన్ సిబ్బంది నుండి ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వరకు టీమ్‌లోని ప్రతి ఒక్కరు చేసిన అద్భుతమైన కృషికి నేను చాలా గర్వపడుతున్నాను. వారి అభిరుచి, కృషి ఈ చిత్రాన్ని అద్భుతంగా మలచడంలో కీలకపాత్ర పోషించాయి.
మేము అర్జున్ చక్రవర్తి జీవితంలోని అధ్యాయాలను తెలియచేయబోతున్నాం. ఈ ఆకర్షణీయమైన ప్రయాణంలో భాగం కావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది పోరాటతత్వం, సంకల్పం, కలల సాధన గురించి తెలిపే కథ. ఈ సినిమా ప్రయాణంలో భాగమైనందుకు ధన్యవాదాలు.” అన్నారు.

 

Tags: Arjun Chakraborty – Journey of an Unsung Champion’ Exciting First Look Released

Post Midle