యాత్రలో జగన్ రెడ్డిగా అర్జున్ రెడ్డి

Arjun Reddy S. Jagan Reddy

Arjun Reddy S. Jagan Reddy

Date:14/09/2018
హైద్రాబాద్, ముచ్చట్లు:
ఒకవైపు ఎన్టీఆర్ బయోపిక్.. మరో వైపు వైఎస్ఆర్ బయోపిక్.. వీరితో పాటు చంద్రబాబు, గోపీచంద్, కె. విశ్వనాథ్ ఇలా చాలా మంది ప్రముఖ సినీ, రాజకీయ జీవితాలను తెరపై ఆవిష్కరించేందుకు ఉబలాటపడుతున్నారు దర్శకులు. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో.. ఈ బయోపిక్‌ల ట్రెండ్ ఊపందుకుంది.
ఇక దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ మూవీ ‘యాత్ర’. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై, అకాల మరణం చెంది మహానేతగా గుర్తింపు పొందిన వైఎస్ ఆర్ జీవిత చరిత్రను మూవీగా మలుస్తున్నారు ఆనందోబ్రహ్మ దర్శకుడు మహి రాఘవ. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. వైఎస్సార్ చేపట్టిన ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రను కథాంశంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ముమ్ముట్టి లీడ్ రోల్ చేస్తుండగా.. ఈ చిత్రంలో ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు? కీలకమైన పాత్రల్లో ఎవరు నటించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది.
ఇప్పటికే వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రలో ‘బాహుబలి’ ఫేం అశ్రితా వేముగంటి నటిస్తుండగా.. వైఎస్ తండ్రి పాత్రలో జగపతిబాబు, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్‌ కుమార్తె షర్మిళ పాత్రలో భూమిక, సూరీడు పాత్రలో పోసాని నటించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో కీలకమైన వైఎస్ జగన్ పాత్రను ఎవరు చేస్తారనే వార్తల నేపథ్యంలో అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ జగన్ రెడ్డిగా మెరవనున్నాడని తాజా సమాచారం.
వాస్తవానికి ఈ పాత్రకోసం మొదట తమిళ హీరో కార్తీని సంప్రదించినప్పటికీ తాజాగా కార్తీ ప్లేస్‌ను అర్జున్ రెడ్డి రీప్లేస్ చేసినట్టు సమాచారం. ‘గీత గోవిందం’ సినిమాతో క్రేజీ హీరోగా మారిన విజయ్ దేవకొండ ఈ ప్రాజెక్ట్‌లో యాడ్ అయితే ‘యాత్ర’ చిత్రానికి హెల్ప్ అవుతుందని చిత్ర యూనిట్ భావించడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘నోటా’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి పొలిటికల్ జానర్ చిత్రాల్లో నటిస్తూ.. రియల్ పొలిటీషియన్ జగన్ పాత్రలో మెరవనుండటం సినీ, పొలిటికల్ సర్కిల్‌లో ఆసక్తికరమైన విషయమే.
దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 70 ఎంఎ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఈ ఏడాది డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘యాత్ర’.
Tags:Arjun Reddy S. Jagan Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *