Natyam ad

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

నంద్యాల  ముచ్చట్లు:

 

ఉపాధ్యాయ, పట్టభద్రుల, స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లుతో సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తో కలిసి పటిష్ట పోలింగ్ ఏర్పాట్లపై మీడియా విలేకరులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ ఈ నెల 13న జరుగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల, స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. భారత ఎన్నికల సంఘం ఫిబ్రవరి 16వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిందని ఈ మేరకు ఫిబ్రవరి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించామన్నారు.
జిల్లాలో పట్టభద్రులకు సంబంధించిన మొత్తం ఓటర్లు 54,929 మంది ఉన్నారని ఇందులో 38,695 మంది పురుషులు కాగా 16,230 మంది స్త్రీలు, ఇతరులు నలుగురు ఉన్నారన్నారు. అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి మొత్తం ఓటర్లు 4426 మందికి ఉన్నారని ఇందులో 2806 మంది పురుషులు కాగా 1619 స్త్రీలు, ఇతరులు ఒకరు ఉన్నారన్నారు.  గ్రాడ్యుయేట్లకు 61 పోలింగ్ స్టేషన్లో, టీచర్లకు 30 పోలింగ్ స్టేషన్లో, స్థానిక సంస్థలకు సంబంధించి మూడు పోలీస్ స్టేషన్లో ఓటర్లు ఓటు వేసేందుకు అన్ని వసతులు సమకూర్చామన్నారు. లోకల్ అథారిటీ ఎన్నికలకు సంబంధించి డోన్ డివిజన్లో 171, నంద్యాలలో 242, ఆత్మకూరు డివిజన్ లో 168 మంది వెరసి మొత్తం 578 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ వివరించారు.

 

Post Midle

సమస్యాత్మకంగా గుర్తించిన 9 లొకేషన్లలో అదనపు భద్రత ఏర్పాటు చేయడంతో పాటు వీడియో గ్రాఫర్లను ఏర్పాటు చేసి వీడియోగ్రఫీని తీయిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. అన్ని పోలింగ్ స్టేషన్లో  473 మంది పోలింగ్ అధికారులకు రెండు దఫాలుగా పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చి స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు.  ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ నిర్వహించడం జరుగుతుందని… పోలింగ్ తీరును ఫ్యూటేజ్ ద్వారా జిల్లాలోని కమాండ్ కంట్రోల్ రూమ్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం వీక్షిస్తుందన్నారు. దీంతోపాటు  పోలింగ్ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించేందుకు118 మంది మైక్రో పరిశీలకులకు సంపూర్ణ శిక్షణ ఇచ్చి నియమించామన్నారు. నంద్యాల, డోన్, ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన డెస్పాచ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి పోలింగ్ సామాగ్రిని, పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు చేరవేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందుకోసం 15  రూట్లను ఏర్పాటు చేసి 34 బస్సులు కేటాయించామన్నారు.  అన్ని రూట్లో 15 మంది సెక్టోరల్ అధికారులను ఏర్పాటు చేసి వారికి విస్తృత అధికారాలు కేటాయించి పోలింగ్ ప్రక్రియ నిర్విఘ్నంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియామౌళి పటిష్టంగా అమలుపరిచేందుకు 29 మండలాల్లో ఎంసీసీ స్క్వాడ్ లను నియమించి నిఘా ఉంచామన్నారు.

 

 

ప్రతి పోలింగ్ కేంద్ర సమీపంలో మెడికల్ టీం ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఓటర్ స్లిప్పులను 97% ఓటర్లకు పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పండుగ వాతావరణంలో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags;Armed arrangements for conducting MLC election polling

Post Midle