ముఖ్యమంత్రి పర్యటన కు పకడ్బంది భద్రతా ఏర్పాట్లు
కర్నూలు ముచ్చట్లు:
ఈ నెల 30 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పత్తికొండ రాక సందర్భంగా భద్రత పరంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కర్నూలు రేంజ్ డిఐజి ఎస్. సెంథిల్ కుమార్, జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఆదేశించారు. శుర్రవారం వారిద్దరూ , ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ , పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ తో పాటు గారు సభా ప్రాంగణం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.పత్తికొండ సెయింట్ జోసెఫ్ స్కూల్ లో రైతు భరోసా కార్యక్రమం జరగనున్న సంధర్భంగా హెలిప్యాడ్ , పోలీసు బందోబస్తు, వాహనాల పార్కింగ్, తదితర ఏర్పాట్లకు సంబంధించి సమన్వయంతో పని చేయాలని , ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.ముఖ్యమంత్రి బహిరంగ సభకు వచ్చే ముఖ్యమైన రహదారులను, రూట్ బందోబస్తులను పరిశీలించారు. పోలీసు అధికారులకు సిబ్బందికి తగిన సూచనలు, సలహాలను చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాసులు , సిఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ రజనీ, ఆర్డీవో మోహన్ దాసు, ఎమ్మార్వో విష్ణు ప్రసాద్ , సిఐలు ప్రసాద్, ఆదినారాయణ రెడ్డి, రామకృష్ణారెడ్డి, మురళీ కృష్ణ పాల్గొన్నారు.
Tags; Armed security arrangements for Chief Minister’s visit

