లెక్కింపునకు ఏర్పాట్లు

Date:20/05/2019

నిజామాబాద్ ముచ్చట్లు:

ఎంతో ఉఠ్కంటతో  ఎదురు చూస్తున్న ఓట్ల లెక్కింపుకు మరి కొద్దిగంటల్లో తెరలేవనుంది.అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేసుకున్న తెలంగాణాలో పార్లమెంటు సంస్ధానాలకు జరిగిన ఎన్నికల కౌటింగ్ కు అవసరమైన అన్నీ ఏర్పాట్లును అధికారులు పూర్తి చేశారు. నిజామాబాద్‌ లోక్‌సభ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా పాలనాధికారి, ఎన్నికల అధికారి ఎంఆర్‌ఎం రావు తెలిపారు. ‎నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు డిచ్‌పల్లిలోని సీఎంసీలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జగిత్యాలలో ఉంటుందని వివరించారు. ఓట్ల లెక్కింపు కోసం సూపర్‌వైజర్లు, సహాయ సూపర్‌వైజర్లు, మైక్రో పరిశీలకులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.ఓట్ల లెక్కింపునకు 18 టేబుళ్లు ఉండగా ఏఆర్‌వోకు అదనంగా ఒక టేబుల్లు ఉంటుందని, ఒక్కో టేబుల్‌కు ఒక ఏజెంట్‌ ఉంటారని చెప్పారు.గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల వారికి లోపలికి అనుమతి ఉంటుందని చెప్పారు.

ఘనంగా జూనియర్  ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

 

Tags; Arrange for counting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *