మండలి ఎన్నికకు ఏర్పాట్లు

Date:30/05/2019

వరంగల్ అర్బన్ ముచ్చట్లు:

ఈ నెల 31న వరంగల్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి, సంయుక్త కలెక్టర్  యస్. దయానంద్ తెలిపారు.  గురువారం ఏనుమాముల మార్కెట్ లో నెలకొల్పిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి బ్యాలెట్ బాక్సలను, పోలింగ్ మెటీరియల్ ను  ఆయా  పోలింగ్ కేంద్రాలకు పంపించినట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు  తెలిపారు. మెత్తం 902 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.  పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. పోలింగ్ ప్రక్రియను నూరు శాతం వెబ్ కాస్టింగ్ చేయటకు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక వాహనాని  కేటాయించినట్లు తెలిపారు. పోలింగ్ మెటీరియల్ తో పాటు పోలింగ్ సిబ్బంది పోలింగ్  కేంద్రాలకు చేరుకున్నట్లు తెలిపారు. పోలింగ్ ను ప్రశాంతం  గా నిర్వహించుటకు మానిటరింగ్ చేయాలని సంబంధిత ఎ.సి.పి.లు డి.ఎస్.పి లతో  సమన్వయం చేసుకోవాలని ఆర్డోలకు సూచించారు. డిస్ట్రిబ్యూటర్ కేంద్రాంలో మెటిరియల్ పంపిణీని మానిటరింగ్ చేశారు.  ఈ  కార్యక్రమంలో ,డి.ఆర్.ఓ. పి మోహన్ లాల్, ఆర్డిఓ-కె, వెంకారెడ్డి, జిల్లా పంచాయితీ అధికారి మహమూద్, తహసిల్ధార్లు పాల్గొన్నారు.

కేసీఆర్.. జగన్ ఢిల్లీ పర్యటన రద్దు

 

Tags: Arrange the council election

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *