సిమెంటు బెంచీల ఏర్పాటు
పెద్దపల్లి ముచ్చట్లు:
లయన్స్ క్లబ్ పెద్దపెల్లి ఎలైట్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా రీజియన్ చైర్ పర్సన్ బంక రామస్వామి, జోన్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ రూ.10 వేల విలువ గల నాలుగు బెంచీలు పట్టణంలోని శాంతి నగర్ లోని పోచమ్మ గుడి ప్రాంగణంలో రెండు సిమెంట్ బెంచీలు, రైల్వే కాలనీలో రెండు బెంచీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జోన్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్, మూడో వార్డు కౌన్సిలర్ లైశెట్టి బిక్షపతి మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని వీటిని అందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ బాద్యులు కంకటి. శ్రీనివాస్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.
Tags; Arrangement of cement benches

