తిరుమల ముచ్చట్లు:
ఆగస్టు 15న నిర్వహించే 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు టీటీడీ సిద్ధమయింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలో గల పరేడ్ మైదానంలో వేదికను అందంగా ముస్తాబు చేశారు. గురువారం ఉదయం 8.30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.జెండా వందనం అనంతరం టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులకు ఐదు గ్రాముల వెండి డాలర్, ప్రశంసాపత్రాలు అందజేస్తారు. చివరగా టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులు, ఉద్యోగుల పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు.
Tags;Arrangements are complete for the Independence Day celebrations at the TTD administration building