Natyam ad

ఆది వరహస్వామి జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు.

8 తేదీ నుండి 10 కార్యక్రమాలు.

కమాన్ పూర్ ముచ్చట్లు:

Post Midle

పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆది వరాహ స్వామి జయంతి ఉత్సవాలు ఈనెల 8వ తేదీ నుండి 10తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ ఇనగంటి ప్రేమలత జగన్నాథరావు కార్య నిర్వహణ అధికారి  కాంతారెడ్డి ప్రధాన అర్చకులు కలకుంట్ల వరప్రసాదాచార్యులు తెలిపారు. 8వ తేదీ ఉదయం సుప్రభాతం ఆరాధన సేవా కాలం నిత్య అభిషేకం గోష్టి గోపూజ యోగశాల ప్రవేశం ఆదివరాహ హవనము నిర్వహించడం జరుగుతుంది. 9వ తేదీ నిత్య హోమం పూర్ణాహుతి నిత్యాభిషేకం నిర్వహించడం జరుగుతుంది అలాగే శ్రీ భూ వరాహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. 10 తేదీన శతఘట అభిషేకం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. శ్రీ ఆది వరాహ స్వామి జయంతి ఉత్సవాలకు పూర్తి ఏర్పాటు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఎమ్మెల్యేలు జడ్పీ చైర్మన్ తో పాటు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

 

Tags: Arrangements for Adi Varahaswamy Jayanti celebrations.

Post Midle