పుంగనూరులో బక్రీద్‌ పండుగకు ఏర్పాట్లు

పుంగనూరు ముచ్చట్లు:

బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని ఎన్‌ఎస్‌.పేట ఈద్గా మైదానంలో ఆదివారం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. కమిషనర్‌ నరసింహప్రసాద్‌ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వెంకటసుబ్బయ్య, సిబ్బందితో కలసి కార్యక్రమాలు నిర్వహించారు. షామియానాలు, మంచినీరు ఏర్పాట్లు చేపట్టారు. ముస్లింలు సోమవారం ఉదయం 7:30 గంటలకు సెంటర్‌లాడ్జి నుంచి ర్యాలీగా బయలుదేరి 8 గంటలకు ఈద్గాలో ప్రార్థనలు నిర్వహించనున్నట్లు సున్నిఅంజుమన్‌ కమిటి అధ్యక్షుడు ఇనాయతుల్లాషరీఫ్‌ తెలిపారు.

 

Tags: Arrangements for Bakrid festival in Punganur

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *