Natyam ad

డిసెంబర్ 11న వైజాగ్ లో కార్తీకదీపోత్సవానికి ఏర్పాట్లు వేగవంతం చేయాలి

– టీటీడీ జెఈవో   సదా భార్గవి

 

తిరుపతి ముచ్చట్లు:

 

పవిత్రమైన కార్తీక మాసంలో డిసెంబర్ 11న వైజాగ్ లో దాతల సహకారంతో కార్తీకదీపోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని టీటీడీ జెఈవో  సదా భార్గవి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో జెఈవో శనివారం సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ కార్తీకదీపోత్సవంలో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన రికార్డింగ్ పనుల కోసం ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ సహకారం తీసుకోవాలని సూచించారు. అవసరమైన విభాగాల నుండి ముందస్తుగా డెప్యుటేషన్ పై సిబ్బందిని పంపాలన్నారు. ఇంజినీరింగ్ అధికారులు ముందుగా వెళ్లి వేదిక, క్యూలైన్లు తదితర పనులను ఎలాంటి జాప్యం లేకుండా చేపట్టాలన్నారు. ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు చేపట్టాలని సూచించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులు ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

 

 

Post Midle

స్థానిక పోలీసుల సహకారం తీసుకొని తగిన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. తగినంతమంది శ్రీవారి సేవకులను ఆహ్వానించాలని, మీడియాతో సమన్వయం చేసుకోవాలని పీఆర్వో డా.టి.రవికి సూచించారు. ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం కోసం తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వేదపఠనం కోసం తిరుమల ధర్మగిరి వేద పాఠశాలతో పాటు ఎస్వీ వేద వర్సిటీ నుంచి వేదపండితులను ఆహ్వానించాలన్నారు. అనంతరం దాతలతో వర్చువల్ సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. వేదిక ను త్వరితగతిన ఖరారు చేయాలని దాతలను కోరారు.ఈ సమావేశంలో ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్  అవధాని, ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి  సోమయాజులు, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ అధికారి  రాజగోపాల్, అన్నమాచార్య ప్రాజెక్ట్ సంచాలకులు డా. విభీషణ శర్మ, వర్చువల్ సమావేశంలో ఎస్ఇ-2  జగదీశ్వర్ రెడ్డి, దాతలు  రాజేష్,  హిమాంశుప్రసాద్, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Arrangements for Kartik Dipotsavam in Vizag on December 11 should be expedited

Post Midle