21న శ్రీకపిలేశ్వరాలయంలో మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి

Date:20/02/2020

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ శుక్ర‌వారం మహాశివరాత్రి పర్వదినం ఘ‌నంగా జ‌రుగ‌నుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్ర‌దేశాలు ఏర్పాటు చేశారు.

మహాశివరాత్రి సందర్భంగా శుక్ర‌వారం తెల్లవారుజామున 2.30 గంటల నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఉదయం 7 నుండి 9 గంటల వరకు రథోత్సవం(భోగితేరు), సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు విశేషమైన నంది వాహనసేవ జరుగనున్నాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఫిబ్ర‌వ‌రి 22వ తేదీ శ‌నివారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.

ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు :

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో మహాశివరాత్రి సందర్భంగా శుక్ర‌వారం ఉదయం 6 నుండి 7 గంటల వరకు మంగళధ్వని, ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు పురాణ‌ప్ర‌వ‌చ‌నం, ఉద‌యం 11.30 నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వరకు సంగీతం, హ‌రిక‌థ‌, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు భక్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు. అదేవిధంగా సాయంత్రం 6.30 నుంచి 9.30 గంటల వరకు నృత్య కార్య‌క్ర‌మాలు, అర్థ‌రాత్రి 1 నుండి 2.30 గంట‌ల వ‌ర‌కు భ‌క్తి సంగీతం, ఉద‌యం 2.30 నుండి 4 గంట‌ల వ‌ర‌కు హ‌రిక‌థ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శివరాత్రి నాడు స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోర‌డ‌మైన‌ది.

కల్పవృక్ష వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామి కనువిందు

Tags: Arrangements for Mahashivaratri are completed in Srikapileswaram on the 21st

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *