శ్రీప్రసన్నఆంజనేయస్వామి ఆలయ ప్రారంభానికి ఏర్పాట్లు – మంత్రి పెద్దిరెడ్డిచే ప్రారంభం
-19 నుంచి మూడు రోజులు ప్రతిష్ట
– ఎంపీ రెడ్డెప్ప
పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని హనుమంతరాయునిదిన్నెలో గల పురాతన శ్రీప్రసన్న ఆంజనేయస్వామి ఆలయ పునఃప్రారంభం ఈనెల 19 న రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. శుక్రవారం చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, పికెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, బోయకొండ చైర్మన్ నాగరాజారెడ్డి, కాంట్రాక్టర్ రెడ్డెప్పరెడ్డి, ప్రజలతో కలసి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పురాతన ఆలయాలకు మహార్ధశ పట్టిందన్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల సొంత నియోజకవర్గంలో పురాతన ఆలయాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని రూ.2 కోట్లతో పునః నిర్మించడం జరిగిందన్నారు. ఈనెల 19 న ఆలయంలో పూజలు ప్రారంభమై, 22న స్వామివారిని ప్రతిష్టించనున్నట్లు తెలిపారు. మంత్రి చేతులు మీదుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులైన జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, నటరాజ తదితరులు పాల్గొన్నారు.
Tags: Arrangements for opening of Sri Prasanna Anjaneyaswamy Temple – Inauguration by Minister Peddireddy
