Natyam ad

తిరుమ‌ల‌లో స‌నాత‌న ధార్మిక సదస్సుకు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేయాలి

– అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో సదస్సు ఘ‌నంగా నిర్వ‌హించాలి

– జేఈవో  స‌దా భార్గ‌వి

 

తిరుమల ముచ్చట్లు:

Post Midle

తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధార్మిక సదస్సుకు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని జేఈవో   స‌దా భార్గ‌వి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తి శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో సోమ‌వారం జేఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, తిరుమల ఆస్థాన మండపంలో నిర్వహించనున్న ధార్మిక సదస్సుకు దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులను ఆహ్వానించేందుకు ఆహ్వాన ప‌త్రిక‌లు, ధార్మిక కార్య‌క్ర‌మాల‌పై బుక్ లెట్ రూపొందించాలని డిపిపి అధికారులను ఆదేశించారు. సదస్సుకు విచ్చేసే స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, వసతి, రవాణా స‌దుపాయాల‌ను స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డానికి ప్ర‌త్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాల‌న్నారు. టీటీడీ నిర్వ‌హించే ధ‌ర్మ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌పై వీడియో రూపొందించాల‌ని ఎస్వీబీసి సిఈవోను ఆదేశించారు. స‌నాత‌న ధార్మిక సదస్సును ఘ‌నంగా నిర్వ‌హించేందుకు లైజ‌న్, నోడ‌ల్ అధికారుల‌ను నియ‌మించాల‌న్నారు.

 

అనంతరం సదస్సు నిర్వహణకు సంబంధించి చేయ‌వ‌ల‌సిన ఏర్పాట్ల‌ను విభాగాల వారిగా జేఈవో స‌మీక్షించారు.ఈ సమావేశంలో వేద విశ్వ‌విద్యాల‌యం విసి ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, ఎస్వీబీసి సిఈవో ష‌ణ్ముఖ కుమార్‌, డిపిపి కార్యదర్శి  సోమయాజులు, ప్రోగ్రాం అధికారి  రాజగోపాల్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి  పిఆర్ ఆనందతీర్థాచార్యులు, క‌ల్యాణం ప్రాజెక్టు అధికారి  చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి డెప్యూటీ ఈవో  గోవింద‌రాజ‌న్‌, జియం(ఐటి)  సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Arrangements for Sanatana Dharmic Conference in Tirumala should be completed quickly

Post Midle