15న జనగణమన ఉత్సవాలకు ఏర్పాట్లు

Arrangements for the Folk Festival on the 15th

Date:13/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో నిత్య జనగణమన ప్రారంభించి ఆగస్టు 15 నాటికి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఆ దినం వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో జనగణమన కమిటి సభ్యులు పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, పి.అయూబ్‌ఖాన్‌, వి.దీపక్‌, సివి.శ్యామ్‌ప్రసాద్‌, ఎన్‌.ముత్యాలు ,కె.రెడ్డిప్రసాద్‌, ఎం.బాబు, షామీర్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపడుతున్నారు. పట్టణంలోని బస్టాండు, ఇందిరా సర్కిల్‌, కెకె.సర్కిల్‌, తూర్పు మొగశాల, గోకుల్‌ సర్కిల్‌, అంబేద్కర్‌ సర్కిల్‌లలో జాతీయ పతాకాలు కట్టి , పట్టణ ప్రజలను, విద్యార్థులను భాగస్వామ్యులను చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రకాష్‌ మాట్లాడుతూ 15న ఉదయం 7 గంటల నుంచి పట్టణ ప్రజలందరు ఎంబిటి రోడ్డు జాతీయ రహదారిపైకి వచ్చి , నిత్యజనగణమన గీతాలాపనలో పాల్గొని , స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు.

 

మదనపల్లె మున్సిపల్‌ కమిషనర్‌గా కెఎల్‌.వర్మ

Tags: Arrangements for the Folk Festival on the 15th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *