అలిపిరి పాదాల‌మండ‌పంలోని ఆలయాల బాలాల‌యానికి ఏర్పాట్లు పూర్తి

Date:23/02/2020

తిరుప‌తి ముచ్చట్లు:

తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద‌గ‌ల శ్రీ‌వారి పాదాల మండ‌పంలోని ఆల‌యాల‌కు ఫిబ్ర‌వ‌రి 24 నుండి 26వ తేదీ వ‌ర‌కు బాలాల‌యం జ‌రుగ‌నుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

పాదాల మండ‌పంలో శ్రీల‌క్ష్మీనారాయ‌ణ‌ స్వామివారి ఆల‌యం, శ్రీ ఆండాళ్ అమ్మ‌వారి ఆల‌యం, పెరియాళ్వార్ ఆల‌యం, శ్రీ భ‌క్తాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యాలు ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు. బాలాల‌యంలో భాగంగా ఫిబ్ర‌వ‌రి 24న ఉద‌యం యాగ‌శాల‌లో అక‌ల్మ‌ష హోమం, ల‌ఘుపూర్ణాహుతి, సాయంత్రం పుణ్యాహ‌వ‌చ‌నంలో అగ్నిప్ర‌తిష్ట‌, క‌ళాక‌ర్ష‌ణ‌, కుంభారాధ‌న ఉక్త హోమాలు చేప‌డ‌తారు. ఫిబ్ర‌వ‌రి 25న ఉద‌యం అగ్నిప్ర‌ణ‌య‌ణం, చిత్ర‌ప‌టాల‌కు కుంభారాధ‌న‌, అక‌ల్మ‌ష‌హోమం, ల‌ఘుపూర్ణాహుతి, సాయంత్రం మ‌హాశాంతి పూర్ణాహుతి, బాలాల‌య చిత్ర‌ప‌టాల‌కు మ‌హాశాంతిప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు.

ఫిబ్ర‌వ‌రి 26న ఉద‌యం 7.30 గంట‌లకు పుణ్యాహ‌వ‌చ‌నం, ఉద‌యం 10.27 నుండి 10.59 గంట‌ల న‌డుమ ఫాల్గుణ శుద్ధ త‌దియ మేష ల‌గ్నంలో బాలాల‌య చిత్ర‌ప‌టాల‌కు కుంభ ఆవాహ‌న చేప‌డ‌తారు. మ‌ధ్యాహ్నం 11.30 గంట‌ల నుండి భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో  వ‌ర‌ల‌క్ష్మీ ఈ కార్య‌క్ర‌మ ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

తిరుమల\|/సమాచారం  

Tags: Arrangements have been completed for the temple children’s school in Alipiri Pada Palam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *