మంత్రి పెద్దిరెడ్డి జన్మదినాన్ని పోటాపోటీలుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు

Arrangements have been made to hold Minister Peddi Reddy's birthday as a feud

Arrangements have been made to hold Minister Peddi Reddy's birthday as a feud

Date:10/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 69వ జన్మదిన వేడుకలను శుక్రవారం అభిమానులు పోటాపోటీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముస్లిం మైనార్టీల నాయకుడు అర్షద్‌అలి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మంత్రి సతీమణి స్వర్ణలత, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వార కనాథరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, యువజన సంఘ నాయకుడు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే పట్టణ పార్టీ అధ్యక్షుడు ఇఫ్తికార్‌ ఆధ్వర్యంలో మరో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. వీటితో పాటు వైఎస్సార్సీపి యువజన సంఘనాయకులు చెంగారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొత్తపల్లె వద్ద అన్నదాన కేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌ ఆధ్వర్యంలో మండల కార్యాలయంలో మండల నాయకులతో కలసి జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. అలాగే మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, కమిషనర్‌ కెఎల్‌.వర్మ కలసి మున్సిపాలిటిలో సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అభిమానులు పోటాపోటిల మధ్య సంబరాలు చేపట్టడంతో పార్టీలో నూతనోత్తేజం పెల్లుబికింది.

కోటం రెడ్డి ఎపిసోడ్ 

Tags: Arrangements have been made to hold Minister Peddi Reddy’s birthday as a feud

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *