అంతర్జాతీయ ప్రమాణాలను తలపిస్తున్న ఏర్పాట్లు
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి నగరపాలక సంస్థ ఆద్వర్యంలోఈ నెల 5న ప్రారంభమై 9 వతేదీ వరకు తిరుపతి ఇందిరా మైదానంలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా, పురుషుల ఆహ్వాన కబడ్డీ పోటీల ఏర్పాట్లు అంతర్జాతీయ ప్రమాణాలను తలపిస్తున్నాయి.నగరంలో గ్రీష్మ తాపం అధికంగా ఉన్నా పోటీలకు ఎలాంటి ఆటంకం లేకుండా చలవ పందిళ్ళు వేశారు. క్రీడాకారులకు మైదానంలో గాయాల నుంచి నియంత్రించేందుకు అంతర్జాతీయ క్రీడలో వినియోగించే మెత్తటి మ్యాట్ ను ఏర్పాటు చేశారు.మహిళలకు , పురుషులకు విడివిడిగా పోటీల నిర్వహణకు మైదానాలను ఏర్పాటు చేసి పోటీలు నిర్వహిస్తున్నారు.రాత్రి వేళల్లోనూ మ్యాచ్ ల నిర్వాహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ దీప కాంతులలో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
డిజిటల్ స్కోర్ బోర్డ్స్ ..
క్రీడా మైదానంలో నాలుగు కోర్టులలో జరిగే మ్యాచ్ ల ఫలితాలను సూచించే బోర్డులను ప్రథమంగా డిజిటల్ పద్దతిలో ఏర్పాటు చేయడం సందర్శకులను , క్రీడాభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి మ్యాచ్ సందర్శనకు అనువుగా మైదానంలో గ్యాలరీలతో పాటు ఇందిరా మైదానం వెలుపల డిజిటల్ టీవీలను సందర్శనకు ఏర్పాటు చేశారు.
సోషల్ మీడియా లోను ..
గతంలో ఎన్నడు లేని విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు అందుబాటులోకి రావడంతో ఈ అవకాశాన్ని కబడ్డీ టోర్నీ నిర్వాహకులు సద్వినియోగం చేసుకుంటున్నారు. మైదానం కు రాకపోయినా తిరుపతి నగరప్రజలతో పాటు దేశ, అంతర్జాతీయం గా ఉన్న క్రీడాభిమానులు తమ చరవాణి ద్వారా క్రీడాపోటీలను ప్రత్యక్షంగా వీక్షించడానికి యూ ట్యూబ్ చానల్స్ ను అందుబాటులో ఉంచారు.
ఎ కె ఎఫ్ ఐ ప్రతినిధులు ..
జాతీయ పోటీలలో పాల్గొనే క్రీడాకారుల ప్రతిభకు ఎక్కడా లోపాలు తలెత్తకుండా ఉండేందుకు సాంకేతిక పరమైన అర్హత ఉన్న అఖిల భారత కబడ్డీ సమైక్య ప్రతినిధులను ఆహ్వానించి పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడాకారులకు ఎక్కడా అవాంతరాలు ఎదురుకాకుండా మైదానంలో, వసతి సదుపాయాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మైదానాలలో బారీకేడ్ లను ఏర్పాటు చేశారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Arrangements that meet international standards