వరద నీరు మళ్లించేందుకు ఏర్పాట్లు పూర్తి

-పోలవరంలో ఇంజనీరింగ్ అద్భుతం

ఏలూరు ముచ్చట్లు :

పోలవరం స్పిల్ వే నుంచి ఈ వర్షాకాలంలో వరదనీరు మళ్ళించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి స్దాయిలో మేఘా ఇంజనీరింగ్ సంస్ద సిద్దం చేసింది.  గోదావరికి అడ్డుకట్ట వేయడం ఇంజనీరింగ్ అద్భుతం నిపుణులు అంటున్నారు. గోదావరి నదీ ప్రవాహ మళ్ళింపు పనులు మొదలు కావడంతో గోదావరి నదీ ప్రవాహాన్ని ఎడమవైపు నుండి కుడివైపుకు మళ్ళిస్తున్నారు. అప్రోచ్ ఛానెల్ నుండి స్పిల్ వే మీదుగా స్పిల్ ఛానెల్ నుండి మరలా …ఫైలెట్ ఛానెల్ దగ్గర సహజప్రవాహంలో గోదావరి కలువనుంది. ఎడమవైపు నుండి కుడివైపుకు దాదాపు 6.5 కి.మీ నదీ ప్రవాహాన్ని మళ్ళిస్తున్నారు. ఈ సీజన్ నుండే గోదావరి నీటిని స్పిల్ వే నుండి విడుదల చేయనున్నారు.  ముందుగా రివర్ స్లూయిజ్ గేట్లను ఎత్తి గోదావరి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఈ వర్షాకాలంలో వచ్చే వరద నీటిని స్పిల్ వే రేడియల్ గేట్లను..ఎత్తి ఉంచడం ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తారు. ఇప్పటికే 14 రేడియల్ గేట్లను పైకి ఎత్తి  సిద్దంగా ఉంచిన అధికారులు, మిగతా గేట్లను ఎత్తి ఉంచేందుకు ఏర్పాట్లుచేసారు.

 

పుంగనూరులో ఇక రూ.750 లకే కరోనా పరీక్షలు-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags; Arrangements to divert flood water are complete

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *