సీఎం పర్యటనకు ఏర్పాట్లు

Date:20/07/2019

సిద్దిపేట ముచ్చట్లు:

ఈ నెల 22న సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక గ్రామ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు శనివారం పరిశీలించారు. తరువాత సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో  జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జేసీ పద్మాకర్, డీఆర్వో చంద్రశేఖర్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సీఎం
సభా, సమావేశ నిర్వహణ పై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. అధికారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో సీఎం పర్యటనను విజయవంతం చేసేలా కృషి చేయాలని కోరారు.

 

 

 

గ్రామంలో ఇటీవల చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం.. సర్వే చేసిన అధికారులే ఇంటింటికీ వెళ్లి సీఎం సభకు హాజరయ్యే గ్రామస్తులకు ప్రతి ఇంటింటికీ ఐడెంటిటీ కార్డులు ఇవ్వనున్నామని., గ్రామస్తులకు అందించే కార్డులు గులాబీ రంగులో ఉంటాయని తెలిపారు. అదే విధంగా అధికారులకు తెలుపు రంగు, మీడియా ప్రతినిధులకు ఆకుపచ్చ రంగు ఐడెంటిటీ కార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు.
గ్రామంలోని 630 గృహాలను టీమ్ లుగా విభజించి, ప్రతి 30 ఇళ్లకు ఒక్క ఎంపీడీఓతో పాటు అదనంగా మరో ప్రత్యేక అధికారిని నియమించినట్లు వివరిస్తూ.., కేటాయించిన 30ఇళ్ల ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సభ సమావేశం పూర్తయ్యే వరకు ఉండాల్సిన బాధ్యత అధికారిదేనని తెలిపారు.

 

ఇస్మార్ట్ శంక‌ర్‌`తో హ్యాట్రిక్ డిస్ట్రిబ్యూట‌ర్‌గా 

Tags: Arrangements to tour Siem Reap

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *