నకిలీ విత్తానాల ముఠా అరెస్టు

సూర్యాపేట ముచ్చట్లు:

నకిలీ విత్తనాలను  తయారు చేసి అమ్ముతూ అమాయక రైతుల్ని మోసం చేస్తున్న  ఆరుగురు సభ్యుల  ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు . హైద్రాబాద్  వనస్దలిపురం కేంద్రంగా మూలపాటి శివారెడ్డి అనే వ్యక్తి    ద్వారాకా సీడ్స్ పేరుతో గత  కొంత కాలంగా  కంపెనీ నిర్వహిస్తున్నడు.  ఇతను  గతంలో కర్ణాటక, తమిళనాడు మద్యప్రదేశ్,  ఇండోర్ ప్రాంతాల్లో పలు సీడ్స్ కంపెనీల్లో పని చేశాడు.  ఆ అనుభవంతో ఇక్కడ కూడా ద్వారాకా సీడ్స్ కంపెనీ ఏర్పాటు చేసుకోని  కాలం చెల్లిన,  లేబుల్స్, లాట్  నెంబర్ లేని,   లెసెన్స్ లేని డీలర్లతో   నాణ్యత ప్రమాణాల ద్రువీకణ  పత్రాలు లేకుండా హై బ్రీడ్  అంటూ మిర్చి, టమాట, బెండ, దొండ, పుచ్చకాయ లాంటి   15 రకాల నకిలీ విత్తనాల్ని  మార్కెట్ లో  అమాయక రైతులకు అంటగడుతున్నాడు. బుధవారం నాడు సూర్యాపేట జిల్లా చింతలపాలెం  మండలంలో   వీటిని గుర్తించిన పోలీసులు  లోతుగా విచారణ చేసి ఈ రాకెట్ ను ఛేధించారు. శివారెడ్డి మహబూబా బాద్, సుజాతానగర్, వత్సవాయి, వైరా ప్రాంతాల్లో  కంపెనీలు ఏర్పాటు చేసి డీలర్లు  నియమించుకుని  ఈ దందా నడిపిస్తున్నట్లు గుర్తించారు.
ఈ దందాలో శివారెడ్డికి సహకరిస్తున్న ద్వారకా  సీడ్స్ ఎకౌండెంట్  యాదగిరి,  రీజనల్ మేనెజర్ లక్ష్మా రెడ్డి లతో పాటు  శివారెడ్డి నియమించుకున్న డీలర్లు ప్రతాప్ కుమార్, జగన్మోహన్ రావు, రమణలను  సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.  వీరి వద్ద నుంచి  986  కిలోల నకిలి విత్తనాలు  స్వాదీనం చేసుకున్నారు.  వీటి విలువ  పదమూడున్నర కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేసారు.

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:Arrest of a gang of counterfeit seeds

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *