వేటగాళ్ల  అరెస్ట్

Date:20/07/2019

భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే  అడవులకు ప్రసిద్ధి,ఈ అడవులలోస్మగ్లర్లు  వేటగాళ్ళు  ప్రసిద్ధి, నిత్యం   ఈ అడవి జంతువుల కోసం ,వేటగాళ్ళు  ఉచ్చులు, కరెంట్ తీగలు ,నాటు తుపాకులు వాడుతూ వేటాడుతుంటారు. తాజాగా అశ్వారావుపేట మండలం మొద్దులమడ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు తమ రోజువారీ తనిఖీ భాగంగా  రేంజర్, డి.ర్.ఓ, మరియు సిబ్బంది,అడవిలో బీట్ నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు  తరస పడ్డారు.  అటవీ అధికారులను చూసి వారు పారిపోయే ప్రయత్నం చేసారు.  ఫారెస్ట్ అధికారులు వెంటాడి వారిని అదుపులోకి తీసుకున్నారు.

 

 

 

 

వారిని  మొద్దులమడ గ్రామానికి చెందిన వెంకటేశ్వరావు, సుక్కరావు, విజయ రావు  గా గుర్తించారు. వారి నుంచి  ఒక నాటు తుపాకీ, రెండు గొడ్డళ్ళు, అడవి జంతువు ” ఉడుము” ను  స్వాధీనం చేసుకొని కేస్ నమోదు చేసారు. ఈ  దాడిలోధమ్మపేట అటవీ శాఖ రేంజర్ శ్రీనివాసరావు, డి.ఆర్.ఓ భాస్కర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

 

రాష్ట్రపతి పాలన కోసమే 

Tags: Arrest of hunters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *