Date:26/11/2020
రంగారెడ్డి ముచ్చట్లు:
దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మె లో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలలో సీఐటీయూ, సీపీఎం శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించాయి. అయితే, ఆదిబట్ల లో బైక్ ర్యాలీని పోలీసులు అనుమతించలేదు. దీంతో కార్మిక నేతలకు పోలీసులకు మధ్య మాటల యుద్దం జరిగింది. అందోళనకారులను అరెస్ట్ చేసి ఆదిభట్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు అనుకూలంగా ఉన్నా కార్మిక చట్టాలను కాపాడాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవాలని వారు అన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగానికి ముప్పు ఉందని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఏబీ వెంకటేశ్వరావుకు సుప్రీంలో చుక్కెదురు
Tags; Arrest of labor leaders in Ibrahimpatnam