టీచర్ల అరెస్టు
గన్నవరం ముచ్చట్లు:
శుక్రవారం జరిగే టీచర్స్ సంకల్ప సభ కి వస్తున్న టీచర్స్ ను పోలీసులు ఎక్కడకిక్కడ అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. జాతీయ రహదారి పై భారీ గేట్లు పెట్టీ 130 మంది టీచర్స్ నీ అదుపులోకి తీసుకొని ఉంగుటూరు, అత్కుర్,గన్నవరం పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఉపాధ్యాయలు మాట్లాడుతూ మేము ఏమి తప్పు చేసాం. సంకల్ప సభ కి వెళ్లే వారిని దొంగలలాగ అరెస్ట్ చేసీరనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. సి. ఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే తప్పు లేదుగానీ మేము సంకల్ప దీక్ష చేయటం తప్పా అని ప్రశ్నించారు. సి.ఏమ్.జగన్ పాదయాత్ర లో మాకు ఇచ్చిన హామీలు నేరవెచ్చేవరకు ఈ పోరాటం ఆగదు అంటున్నారు.
Tags: Arrest of teachers

