Date:13/01/2021
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ తాటిచెట్లపాలెంలో గత నెల షేక్ సుభాన్ మహబూబ్ అనే రౌడీషీటర్ హత్యను పోలీసులు చేధించారు. అతనితో పాటు సహజీవనం చేస్తున్న మహిళే నిందితురాలిగా గుర్తించి అరెస్టు చేశారు. గత కొంతకాలంగా సుభాన్ మహబూబ్, జనీత్ పర్వీన్ అనే మహిళతో సహజీవనం సాగిస్తున్నాడు. అయితే పర్వీన్ మహబూబ్‌ను కర్రతో తలపై కొట్టి, ఇంటికి బయట నుంచి తాళం పెట్టి పారిపోయింది. పరిసరాల్లోని వారంతా దుర్వాసన వస్తుందని ఫిర్యాదు చేయటంతో మహబూబ్ హత్యకు గురైనట్లు గుర్తించారు. నిందితురాలిని కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో అరెస్టు చేసినట్లు ఏసీపీలు శ్రావణ్‌కుమార్, హర్షిత చంద్ర తెలిపారు.
ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ
Tags: Arrest of the killer